ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్ధులు చదువుతో పాటుసాహిత్యంపై మక్కువ పెంచుకోవాలి:Governor

ABN, First Publish Date - 2022-05-18T00:41:13+05:30

విద్యార్ధులు చదవుతో పాటు సాహిత్యం, పఠనం పై ఆసక్తిని పెంచుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Tamilisy soundera rajan) అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: విద్యార్ధులు చదవుతో పాటు సాహిత్యం, పఠనం పై ఆసక్తిని పెంచుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Tamilisy soundera rajan) అన్నారు. విద్యార్ధులు చదవుతో పాటు తమకు ఆసక్తి వున్న రంగాలలో కూడా తమ ప్రతిభను చాటుకోవాలన్నారు. ముఖ్యంగా ఆటలు, పాటలు, పఠనం, క్రీడల్లో విద్యార్ధులు రాణించాలన్నారు. మంగళవారం రాజ్ భవన్ దర్బార్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో రాజ్ భవన్ స్కూల్ మేగజైన్ ను గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను చదువుకునే రోజుల్లో కూడా స్కూల్, కాలేజీ రోజుల్లో కూడా మేగజైన్ లకు తన వంతుగా ఎన్నో ఆర్టికల్స్ రాసేదానినని చెప్పారు. 


ప్రస్తతుం దేశంలో ఆజాదీ కా అమ`త్ మహోత్సవ్ ఉత్సవాలను జరుపుకుంటున్నాము. విద్యార్ధులు మన దేశం స్వాతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు పోరాటం చేశారని, వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం వుందన్నారు. మహనీయుల చరిత్రను తెలుసుకోవడం ద్వారా విద్యార్ధులు మరింత ఉన్నతంగా ఎదిగే అవకాశం వుందన్నారు. స్కూల్ మేగజైన్ కు వివిధ రకాల ఆర్టికల్స్ కంట్రిబ్యూట్ చేసిన విద్యార్ధులను గవర్నర్ అభినందించారు. రాజ్ భవన్ అధికారులు విద్యార్ధులకు రాజ్ భవన్ అన్నం, బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. 

Updated Date - 2022-05-18T00:41:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising