ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల కోసం ప్రభుత్వం ఒక్క ఇల్లూ కట్టకపోవడం బాధాకరం: కోమటిరెడ్డి

ABN, First Publish Date - 2022-01-31T00:57:04+05:30

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా పేదల కోసం ప్రభుత్వం ఒక్క ఇల్లూ కట్టకపోవడం బాధాకరమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా పేదల కోసం ప్రభుత్వం ఒక్క ఇల్లూ కట్టకపోవడం బాధాకరమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సొంతింటి కల నెరవేరినప్పుడే పేదలు కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోతారని తెలిపారు. కేవలం సిరిసిల్ల, గజ్వేల్‌, పాలకుర్తి నియోజకవర్గాల్లోనే డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరయ్యాయే.. తప్ప మరే నియోజకవర్గంలోనూ ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని ఆరోపించారు. దళితులంటేనే పేదవారని, ప్రతి నియోజకవర్గంలో దాదాపు 15వేల కుటుంబాలు ఉంటాయని, వాళ్లలో 100మందిని ఎంపిక చేయడం కత్తి సాములాంటిదేనని అన్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసే ఎమ్మెల్యేలు అభాసుపాలు కాకతప్పదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోస్యం చెప్పారు. 

Updated Date - 2022-01-31T00:57:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising