ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్గొండ జిల్లాలో మటన్ ప్రియులకు శుభవార్త

ABN, First Publish Date - 2022-01-02T00:20:53+05:30

వినియోగదారులను ఆకర్షించేందుకు వ్యాపారస్తులు రకరకాల ఆఫర్లను ప్రకటించి ఆకట్టుకుంటూ ఉంటారు. బుర్రకు తట్టిన ప్రతి ఐడియాను వినియోగదారులపై విసురుతుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: వినియోగదారులను ఆకర్షించేందుకు వ్యాపారస్తులు రకరకాల ఆఫర్లను ప్రకటించి ఆకట్టుకుంటూ ఉంటారు. బుర్రకు తట్టిన ప్రతి ఐడియాను వినియోగదారులపై విసురుతుంటారు. వ్యాపారస్తుల మాయలో వినియోగదారుడు పడడం మామూలే. ఇటీవల చిత్తూరు జిల్లా పీలేరులో వ్యాపారస్తులు పోటీ పడి తగ్గించడంతో కిలో పొట్టేలు/మేక మాంసం కేవలం రూ.50 వంతున అమ్మకాలు సాగించారు. కొనుగోలుదారులు సైతం పోటీలు పడి ఒక్కొక్కరు ఐదు నుంచి పది కిలోల వరకూ కొన్నారు. ఇదే కోవలో నల్గొండ జిల్లాలో ఓ దుకాణదారుడు కిలో మటన్ కొన్న వారికి ఆఫర్ ప్రకటించారు.


నూతన సంవత్సరం సందర్భంగా నల్గొండ జిల్లా చండూరులో ఓ మటన్ షాపు యజమాని వినియోగదారులకు ఆఫర్ ఇచ్చారు. కిలో మటన్ కొన్నవారికి ఓ టిఫన్ బాక్స్ ఉచితంగా ఇచ్చాడు. ఈ ఆఫర్ కూడా ఒక రోజు మాత్రమే పెట్టాడు. దీంతో మాంసప్రియులు క్యూ కట్టారు. ఆలస్యమైన మటన్ కొని వారి వెంట టిఫన్ బాక్స్ తీసుకెళ్లారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ కవర్‌ను నిషేదించేందుకే టిఫిన్ బాక్స్ ఆఫర్ పెట్టానని షాపు యజమాని చెప్పారు. లాభం కోసం కాదని ఆయన వివరించారు. 

Updated Date - 2022-01-02T00:20:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising