ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tarun chugh: బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యం: తరుణ్ చుగ్

ABN, First Publish Date - 2022-10-19T00:12:48+05:30

Delhi: సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలులో విఫలమయ్యారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ విమర్శించారు. కుటుంబ పాలన వల్లే రాష్ట్రంలో అభివ‌ృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ఢిల్లీలో మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ తరుణ్ చుగ్‌ను కలిసిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Delhi: సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలులో విఫలమయ్యారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ విమర్శించారు. కుటుంబ పాలన వల్లే రాష్ట్రంలో అభివ‌ృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ఢిల్లీలో మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ తరుణ్ చుగ్‌ను కలిసిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘తెలంగాణ కేవలం ఒక కుటుంబం కోసం మాత్రమే ఏర్పడింది. ఎనిమిది సంవత్సరాలు కుటుంబ పాలన వల్ల తెలంగాణ వెనకబడింది. ఓబీసీ, డబుల్ బెడ్ రూమ్, దళిత బంధు, ఏ ఒక్క పథకాన్ని తెలంగాణలో సరిగ్గా అమలు చేయలేదు. తెలంగాణ దేనికోసం ఏర్పడిందో ఆ కలను కేసీఆర్ నెరవేర్చలేదు. మహిళలు , యువకులు, డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజలు తెలంగాణలో ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడే ప్రతి ఒక్కరిని పార్టీలో ఆహ్వానిస్తున్నాం. బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యం’’


తెలంగాణ అభివృద్ధి కోసమే బీజేపీతో జతకడుతున్నా.. బూర నరసయ్య గౌడ్, టీఆర్ఎస్ మాజీ ఎంపీ

‘‘పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకి బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. బీజేపీ కేంద్ర మంత్రుల సహకారంతోనే నా నియోజకవర్గ భువనగిరి అభివృద్ధి చెందింది. టీఆర్ఎస్‌లో తెలంగాణ ఉద్యమకారులందరి నోర్లు మూయబడ్డాయి. దేశం అభివృద్ధి చెందాలన్నా.. తెలంగాణ అభివృద్ధి చెందాలన్న ప్రధాని మోదీతోనే సాధ్యం. జేపీ నడ్దా నాకు మంచి స్నేహితులు. ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధి కోసమే బీజేపీలో చేరబోతున్నా. నాతోపాటు నా నియోజకవర్గ నుంచి చాలామంది  ఆ పార్టీలో చేరబోతున్నా’’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-19T00:12:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising