TS news: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత
ABN, First Publish Date - 2022-08-12T17:16:28+05:30
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది.
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్పోర్ట్ (Shamshabad airport)లో భారీగా బంగారం (Gold) పట్టుబడింది. బెహరాయిన్ నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర రూ.14 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బంగారాన్ని పేస్ట్‌గా మార్చి తరలిస్తుండగా పట్టుకున్నారు. వెంటనే ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Updated Date - 2022-08-12T17:16:28+05:30 IST