ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరిఖనిలో రాళ్లవాన

ABN, First Publish Date - 2022-01-15T01:32:20+05:30

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని రాళ్ల వాన వణికించింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో మొదలైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని రాళ్ల వాన వణికించింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో మొదలైన భారీ వర్షం రాళ్లవానగా మారింది. 40 నిమిషాలపాటు కురిసిన భారీ వర్షంతో పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. హోర్డింగులు, ఇంటి పైకప్పులు లేచిపోయాయి. పలుచోట్ల చెట్లు కూలి విద్యుత్‌ స్థంభాలపై పడడంతో స్థంబాలు విరిగిపోయాయి. దీంతో పారిశ్రామిక ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.


పవర్‌హౌస్‌కాలనీలో భారీ వృక్షాలు రోడ్లపై పడిపోయాయి. జీడీకే 2ఏ, ఫైవింక్లయిన్‌ బ్రిడ్జిలు వరదతో నిండిపోగా, విఠల్‌నగర్‌, ఫైవింక్లయిన్‌, అడ్డగుంటపల్లిలో పలు చోట్లలో వరద నీరు ఇండ్లలోకి వచ్చింది. రామగుండం కార్పొరేషన్‌లో ఉన్న ప్రధాన నాలాలు వరదనీటితో పొంగిపొర్లాయి. కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో గాలివాన బీభత్సంతో పెగడపల్లిలో చెట్లు విరిగిపడ్డాయి. పెగడపల్లితో పాటు పలు గ్రామాల్లో ఇంటిపైన రేకులు లేచిపోయాయి. కొద్దిసేపు రాళ్ల వాన కురిసింది. గాలివాన కారణంగా కొన్ని గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

Updated Date - 2022-01-15T01:32:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising