తండ్రిని తీసుకొచ్చేందుకు వెళ్లి....
ABN, First Publish Date - 2022-12-31T00:56:40+05:30
చీకటి పడినా తం డ్రి ఇంటికి రాలేదని తం డ్రిని తీసుకెళ్లేందుకు వచ్చిన కుమారుడు మృతి చెందాడు. నడుచుకుంటూ వెళ్తున్న తండ్రీకొడుకులను కారు ఢీకొట్టడంతో కుమారుడు అక్కడికక్కడే మృతి చెం దగా, తండ్రికి తీవ్రగాయాలయ్యాయి.
తండ్రిని తీసుకొచ్చేందుకు వెళ్లి....
కారు ఢీకొని కుమారుడు మృతి
తండ్రికి తీవ్రగాయాలు
పెద్దఅడిశర్లపల్లి, డిసెంబరు 30: చీకటి పడినా తం డ్రి ఇంటికి రాలేదని తం డ్రిని తీసుకెళ్లేందుకు వచ్చిన కుమారుడు మృతి చెందాడు. నడుచుకుంటూ వెళ్తున్న తండ్రీకొడుకులను కారు ఢీకొట్టడంతో కుమారుడు అక్కడికక్కడే మృతి చెం దగా, తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం మండలంలోని కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారిపైన గల అంగడిపేట ఎక్స్‌రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, గుడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అంగడిపేట ఎక్స్‌రోడ్డుకు చెందిన బొర్ర రమణయ్య ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. అ తనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రాంచరణ్ నల్లగొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. చిన్నకుమారుడు శివచరణ్ (13) ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి అయినా తండ్రి రమణ య్య ఇంటికి రాకపోవడంతో చిన్న కుమారుడు శివచరణ్ ఆయన్ను తీసుకొచ్చేందుకు ఆస్పత్రి వద్దకు వెళ్లాడు. రోగులను పరీక్షించిన అనంతరం ఆస్పత్రికి తాళం వేసి జాతీ య రహదారి పక్క నుంచి తండ్రీకొడుకులు నడుకుంటూ వెళ్తున్నారు. అదే సమయం లో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. దీంతో రమణయ్య పక్కకు పడిపోగా శివచరణ్ ఎగిరి దూరంగా ఉన్న ద్విచక్రవాహనంపై పడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. రమణయ్యకు తీవ్రగాయాలవడంతో వెం టనే 108లో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని చరణ్ మృతదేహాన్ని దేవరకొండ ఆ స్పత్రిలోని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - 2022-12-31T00:56:45+05:30 IST