ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రసాభాసగా GHMC మీటింగ్.. కామెడీ షో చేశారన్న కాంగ్రెస్ కార్పొరేటర్

ABN, First Publish Date - 2022-09-20T18:54:37+05:30

జీహెచ్ఎంసీ (GHMC) జనరల్ బాడీ మీటింగ్ రసాభాసగా మారింది. టీఆర్ఎస్‌(TRS)లో చేరిన కార్పొరేటర్ల అంశంపై గొడవ తలెత్తింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad : జీహెచ్ఎంసీ (GHMC) జనరల్ బాడీ మీటింగ్ రసాభాసగా మారింది. టీఆర్ఎస్‌(TRS)లో చేరిన కార్పొరేటర్ల అంశంపై గొడవ తలెత్తింది. దీంతో బీజేపీ కార్పొరేటర్లు (BJP Corporators) పోడియంను చుట్టముట్టారు. టీఆర్ఎస్‌ (TRS)లో చేరిన కార్పొరేటర్లను మన్నే కవిత (Manne Kavitha) పొగిడారు. సిద్ధాంతాలు నచ్చి టీఆర్‌ఎస్‌లో చేరానని బాబా ఫసియుద్దీన్ (Baba Fasiyuddin) తెలిపారు. బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


బీజేపీ కార్యకర్తలు పోడియంను చుట్టుముట్టడంతో మేయర్ సభను వాయిదా వేశారు. దీంతో సభ ఐదు నిమిషాల పాటు వాయిదా పడింది. అనంతరం 

జీహెచ్ఎంసీలో పన్నుల(Tax) వసూళ్లపై చర్చ జరిగింది. చార్మినార్ జోన్‌లో 50 శాతం మాత్రమే పన్నులు వసూలు చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్ పేర్కొన్నారు. ఎల్బీ నగర్(LB Nagar) నుంచి 284 కోట్లు, చార్మినార్ జోన్ నుంచి కేవలం 102 కోట్లు మాత్రమే వసూలు చేశారన్నారు. పన్నులు వసూలు అయిన ప్రాంతాలకు ఎక్కువ నిధులు కేటాయించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. 


ప్రభుత్వం భవనాలకు సంబంధించిన పన్నులు ఎందుకు వసూలు చేయడం లేదని బీజేపీ కార్పొరేటర్ వంగా మధుసూధన్ రెడ్డి(BJP Corporator Vanga Madhusudhan Reddy) పేర్కొన్నారు. హాస్పిటల్స్, స్కూల్స్, పోలీస్ స్టేషన్లకు సంబంధించి 1996 నుంచి 3 వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని కమిషనర్ లోకేష్ కుమార్ (Commissioner Lokesh Kumar) పేర్కొన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భవనాల బకాయిలు ఎలా వసూలు చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


బల్దియా సమావేశాలను కామెడీ షో చేస్తున్నారని కాంగ్రెస్ కార్పొరేటర్ విజయారెడ్డి (Congress Corporator Vijaya Reddy) పేర్కొన్నారు. మన్నే కవిత టీఆర్ఎస్ పార్టీ (TRS Party) భజన చేయడానికి సభను వాడుకుంటున్నారని ఆరోపించారు. మెప్పు పొందేందుకు మన్నే కవిత.. కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) భజన చేస్తున్నారన్నారు. అలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని విజయారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-09-20T18:54:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising