ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gangrape Case... ఆరుగురు నిందితుల సెల్‌ఫోన్లు సీజ్

ABN, First Publish Date - 2022-06-10T01:32:48+05:30

గ్యాంగ్‌రేప్‌ కేసులో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల సెల్‌ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: గ్యాంగ్‌రేప్‌ కేసులో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల సెల్‌ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఘటనా సమయంలో నిందితులు వేసుకున్న దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో నిందితుల కదలికలపై టెక్నికల్ ఆధారాలు సేకరించారు. రేపు (10వ తేదీ) జువైనల్‌ హోంలో మైనర్లను  పోలీసులు ప్రశ్నించనున్నారు. నిందితుల టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ కోసం పోలీసుల పిటిషన్ దాఖలు చేశారు. 



గ్యాంగ్‌రేప్‌ (Gangrape) కేసులో మైనర్లకు 4 రోజుల కస్టడీలోకి పోలీసులు తీసుకోనున్నారు. రేపటి నుంచి జువైనల్‌ కోర్టు నిందితులను పోలీసులు విచారించేందుకు కస్టడీకి అనుమతిచ్చింది. 14వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. కస్టడీకి అనంతరం మైనర్లను జువైనల్‌ హోం తరలించాలని కోర్టు ఆదేశించింది. జువైనల్స్‌ తమ అడ్వొకేట్‌ను కలిసేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఇప్పటికే ఈ కేసులో నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసుల మొదటి రోజు కస్టడీ ముగిసింది. మైనర్లతో మాలిక్‌కు ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. మైనర్లను కస్టడీకి ఇస్తే మరికొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-06-10T01:32:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising