ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొంగ నోట్ల ముఠా అరెస్ట్‌

ABN, First Publish Date - 2022-01-15T02:30:29+05:30

దొంగ నోట్లు ముద్రించి వివిధ ప్రాంతాల్లో చలామణి చేస్తున్న ముఠాను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి: దొంగ నోట్లు ముద్రించి వివిధ ప్రాంతాల్లో చలామణి చేస్తున్న ముఠాను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పెద్దపల్లి ఏసీపీ సాదుల సారంగపాణి శుక్రవారం తన కార్యాలయంలో వెల్లడించారు. నాలుగు నెలల కితం కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో నకిలీ నోట్లు చలామణి జరిగాయన్న సమాచారం వేరకు పోలీస్‌ బృందాలు విచారణ చేపట్టాయని తెలిపారు. సుల్తానాబాద్‌ చెరువు కట్ట వద్ద ఈ నకిలీ నోట్లను తయారు చేసి చలామణి చేసే ముఠాను శుక్రవారం అదుపులోకి తీసుకున్నామని వివరించారు. కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన చల్లా రాయమల్లు, దారాంగుల వెంకటి, పెండం నగేష్‌, చిన్నరాతుపల్లికి చెందిన దుత్యాల అనీల్‌, బసంత్‌నగర్‌కు చెందిన కొమిరే రాజులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. వీరి నుంచి రూ.77,400 నగదు, దొంగనోట్ల తయారీకి ఉపయోగించే నాలుగు లక్షల విలువ చేసే సామగ్రి స్టేషనరీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాజమల్లు గతంలో కూడా దొంగనోట్ల తయారీ కేసులో పట్టుబడి జైలు జీవితం గడిపాడని సారంగపాణి తెలిపారు. 

Updated Date - 2022-01-15T02:30:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising