ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: గాంధీభవన్‌లో కీలక సమావేశం

ABN, First Publish Date - 2022-08-10T23:17:20+05:30

గాంధీభవన్‌ (Gandhi Bhavan)లో కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు అధ్యక్షతన సమావేశమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: గాంధీభవన్‌ (Gandhi Bhavan)లో కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ భేటీలో మునుగోడు ఉపఎన్నికపై చర్చించినట్లు తెలుస్తోంది. మునుగోడు  ఆశావాహులతో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణిక్యం ఠాగూర్‌తో కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. మునుగోడుపై చర్చించడానికి రెండు రోజుల్లో ఠాగూర్ హైదరాబాద్ రానున్నారు. రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక ఖరారైంది. సాధారణ ఎన్నికల ముందు జరిగే ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నిక కాంగ్రెస్‌ భవిష్యత్తుకు చావో రేవోగా మారడంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భారీ స్కెచ్‌తో రంగంలోకి దిగుతున్నారు. దిగ్గజాల జిల్లా, తాను జోక్యం చేసుకోవడం సరికాదని ఇంతకాలం వేచి చూసిన ఆయన కోమటిరెడ్డి బ్రదర్స్‌ వ్యహారంతో మునుగోడు ఎన్నిక కేంద్రంగా జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఆయన పూర్తిగా తలదూర్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్‌ చెరుకు సుధాకర్‌కు రేవంత్‌ కాంగ్రెస్‌ కండువా కప్పారు. మునుగోడులో బలమైన అభ్యర్థిని బరిలో నిలపనున్నారు. ఈ క్రమంలోనే అందరికంటే ముందుగా ఉపపోరులో చండూరులో బహిరంగ సభ పేరుతో ఎన్నికల యుద్ధంలోకి దిగారు.

Updated Date - 2022-08-10T23:17:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising