ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిసెంబరు వరకు ఉచిత బియ్యం

ABN, First Publish Date - 2022-10-07T08:00:55+05:30

చౌక ధరల దుకాణాల్లో మరో విడతగా ఒక్కొక్కరికీ 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున పంపిణీ:  మంత్రి గంగుల 

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): చౌక ధరల దుకాణాల్లో మరో విడతగా ఒక్కొక్కరికీ 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 90.01 లక్షల రేషన్‌ కార్డుదారులున్నారని, వీరిలో కేంద్ర ప్రభుత్వం కేవలం 54.37 లక్షల కార్డుదారులకు మాత్రమే ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత రేషన్‌ అందిస్తోందన్నారు. మిగతా 35.64 లక్షల కార్డుదారులకురాష్ట్ర ప్రభుత్వం పూర్తి వ్యయంతో ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్నదని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మరో విడతగా అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలకు పీఎంజీకేఏవై పథకాన్ని పొడిగించిందని, ఇందుకోసం 19,057 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుందన్నారు.


ఉచిత బియ్యం కోసం ప్రతి నెల రూ. 75.75 కోట్ల చొప్పున మూడు నెలలకు అదనంగా రూ.227.25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. పీఎంజీకేఏవై ప్రారంభించినప్పటి నుంచి బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,308 కోట్లు ఖర్చు చేసిందని, ఇదికాకుండా కరోనా సమయం లో వలస కూలీలకు రూ.500, ప్రతి కార్డుకు రూ.1,500 చొప్పున రెండు నెలలు అం దించామని... ఆ మొత్తం రూ.2,454 కోట్లు అయిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-07T08:00:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising