ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ponnala Lakshmaiah: నా ప్రాణం ప్రాణహితలోనే ఉంది: పొన్నాల

ABN, First Publish Date - 2022-07-28T18:18:19+05:30

తన ప్రాణం ప్రాణహితలోనే ఉందని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తన ప్రాణం ప్రాణహితలోనే ఉందని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్‌(KCR)ను కొంగముక్కు అంటూ సెటైర్ వేశారు. అనుభవరాహిత్యం, అహంకారం తోడైన వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు. ప్రాజెక్టులు కల్వకుంట్ల కుటుంబానికి కమీషన్ల పండించిందని విమర్శించారు. కాళేశ్వరం (Kaleshwaram) నీళ్లతో ప్రయోజనం ఉందా? నిరుపిస్తారా అని కేసీఆర్‌కు పొన్నాల ఛాలెంజ్ విసిరారు. చరిత్రలో నిరుపయోగమైన ప్రాజెక్టు కట్టిన చరిత్ర కేసీఆర్ దే అంటూ యెద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల ప్రయోజనం కోసం లోపాయికారీ ఒప్పందతోనే కేసీఆర్ ప్రాజెక్టులు కట్టారన్నారు.


మల్లన్నసాగర్‌లో 50 టీఎంసీలు నింపే దమ్ము కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. డిజైన్ లోపం బయటపడుతుందనే ప్రాజెక్టుల దగ్గరికి ఎవర్నీ పోనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల దగ్గర తామేమైనా బాంబులు పెడుతామా? అంటూ నిలదీశారు. ఎవర్నీ అడిగి కేసీఆర్ ప్రాజెక్టులు కడుతున్నారన్నారు. తెలంగాణలో నీళ్ళ కోసం పోరాటం చేసిన చరిత్ర కాంగ్రెస్‌(Congress)దని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రాజెక్టులకు, టీఆర్ఎస్ ప్రాజెక్టులకు తేడా ఎంత ఉందో చూడాలని పొన్నల లక్ష్మయ్య పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-28T18:18:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising