ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TRSలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సందడి.. KCR ఆఫర్‌కు నో చెప్పిన మాజీ ఎంపీ..!

ABN, First Publish Date - 2022-05-17T18:29:39+05:30

TRSలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సందడి.. KCR ఆఫర్‌కు నో చెప్పిన మాజీ ఎంపీ..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : టీఆర్ఎస్‌లో రాజ్యసభ (Rajya Sabha) అభ్యర్థుల సందడి నెలకొంది. ఇవాళ సాయంత్రంలోపు అభ్యర్థులను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఖరారు చేయనున్నారు. బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి నామినేషన్ల గడువు ఈనెల 19న ముగియనున్నది. అయితే సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌కు (Prakash Raj) రాజ్యసభ ఛాన్స్ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే రెండేళ్లు మాత్రమే పదవీకాలం ఉంది.


మరోవైపు.. కెఫ్టెన్ లక్ష్మీకాంతరావు, డీఎస్‌ స్థానాలు ఖాళీ కావడంతో మరో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో దీవకొండ దామోదర్‌రావు పేరును కేసీఆర్ దాదాపు ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే.. రాజ్యసభ సీటు ఆఫర్ చేసినా అసెంబ్లీకే పోటీ చేస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తేల్చిచెప్పేశారని తెలుస్తోంది. అయితే.. ఈ విషయంపై కాసేపట్లో ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను పొంగులేటి కలవనున్నారు. ఒకవేళ పొంగులేటి (Ponguleti) కాదంటే హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారధి రెడ్డికి ఛాన్స్ దక్కనుంది. మే- 31 నామినేషన్ల తుది గడువు కాగా.. జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - 2022-05-17T18:29:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising