ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Komatireddy rajagopal reddy: కేసీఆర్ క్షమాపణ చెప్పాకే మునుగోడులో అడుగుపెట్టాలి

ABN, First Publish Date - 2022-08-19T19:42:45+05:30

మునుగోడు ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పిన తర్వాతే నియోజకవర్గంలో అడుగు పెట్టాలని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: మునుగోడు ప్రజలకు సీఎం కేసీఆర్ (CM KCR) క్షమాపణ చెప్పిన తర్వాతే నియోజకవర్గంలో అడుగు పెట్టాలని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి (Komatireddy rajagopal reddy) డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project)పై ఉన్న శ్రద్ధ డిండి ప్రాజెక్టు (Dindi project)పై ఎందుకు లేదని ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గం అంటే కేసీఆర్‌ (KCR)కు అంత చిన్న చూపు ఎందుకని నిలదీశారు. సిరిసిల్ల, సిద్దిపేట అభివృద్ధికి పెట్టిన ఖర్చు ఎంత ?... మునుగోడుకు పెట్టిన ఖర్చు ఎంతో లెక్కలు చెప్పాలని అన్నారు. రాజ్‌గోపాల్ రెడ్డి (Former MLA) పేరు వస్తుందనే అక్కసుతో మునుగోడుకు పైసా నిధులివ్వలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ది జరగదని కేసీఆర్ (Telangana CM) చెప్పకనే చెప్పారన్నారు.


మునుగోడు ప్రజల నమ్మకాన్ని తీర్చలేదు కాబట్టే రాజీనామా చేసినట్లు వివరించారు. ఎక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడ నిధుల వరద పారుతోందన్నారు. తన పదవి త్యాగంతో మునుగోడు అభివృద్ది జరగడం శుభపరిణామమని చెప్పారు. ‘‘ఫామ్ హౌస్ నుంచి మునుగోడుకు పరుగులు పెడుతుండు అంటే అది నా త్యాగ ఫలితమే’’ అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా వివక్షకు గురయ్యామో, అదే వివక్ష ఇప్పుడు నల్గొండ జిల్లాపై ఉందని తెలిపారు. కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కావాలన్నారు. కేసీఆర్‌కు ప్రజలకు మధ్య యుద్దమే మునుగోడు ఉపఎన్ని (Munugodu by poll)క అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-19T19:42:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising