ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీలో చేరుతున్నా.. క్లారిటీ ఇచ్చిన కొండా విశ్వేశ్వరరెడ్డి

ABN, First Publish Date - 2022-06-30T23:23:52+05:30

ప్రధాని మోదీ (Pm Modi) సమక్షంలో బీజేపీ (Bjp) చేరాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Jp Nadda) సూచించారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): ప్రధాని మోదీ (Pm Modi) సమక్షంలో బీజేపీ (Bjp)లో చేరాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Jp Nadda) సూచించారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి (Ex Mp Konda Visweswarreddy) అన్నారు. తొలుత జులై 1న బీజేపీలో చేరమన్నారని.. ఇప్పుడు  జులై 2 లేదా 3న బీజేపీలో చేరాలని జేపీ నడ్డా చెప్పారని ఆయన తెలిపారు. ఎంపీగా పోటీ చేయాలని తాను భావిస్తున్నానని స్పష్టం చేశారు. ఎంపీగా అయితే తన పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉంటాయని.. ఎక్కువ నియోజకవర్గాలకు సేవలందించాలని తనకు ఉందన్నారు. 


ఏ పార్టీ అయితే సీఎం కేసీఆర్ (Cm Kcr)‎ను ఓడిస్తుందో ఆ పార్టీలో చేరతానని రెండేళ్లు క్రితమే చెప్పానని కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్‎ను బీజేపీ మాత్రమే ఓడించగలుతుందని పేర్కొన్నారు. కేసీఆర్‎ను కాంగ్రెస్ (Congress) ఓడించలేదన్నారు. కాంగ్రెస్ అంటే కేసీఆర్‎కు భయంలేదని చెప్పారు. కాంగ్రెస్‎ను ఫుట్ బాల్ అడుకోవచ్చని కేసీఆర్ అనుకుంటున్నారని తెలిపారు. ఈటల రాజేందర్ రెడ్డి (Etala Rajendar) గెలుపుతోనే టీఆర్ఎస్ సగం ఓడిపోయిందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతిని జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఐదు అంశాలతో కూడిన లేఖను నడ్డాకు అందజేశామన్నారు. త్వరలోనే క్లారిటీ వస్తుందని భావిస్తున్నానని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో రూ. 1000 కోట్లతో డ్రై లాండ్ అగ్రికల్చరల్ బోర్డు ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలను కోరారని చెప్పారు. పెద్ద మంగళవారం గ్రామంలో ఎల్పీజీ బయో గ్యాస్ (Lpg Bio Gas) ప్రాజెక్టును ఏర్పాటు చేసి జిల్లా మొత్తానికి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. 





Updated Date - 2022-06-30T23:23:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising