ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం నినాదం జంగల్ బచావో, జంగల్ బడావో నిత్య జీవితంలో భాగం కావాలి

ABN, First Publish Date - 2022-03-06T01:12:04+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన నినాదం జంగల్ బచావో, జంగల్ బడావో నినాదం ప్రతీ అటవీ అధికారి, సిబ్బందికి నిత్య జీవితంలో భాగం కావాలని కొత్తగా అటవీ శాఖ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన పీసీసీఎఫ్ ఆర్.ఎం. డోబ్రియల్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన నినాదం జంగల్ బచావో, జంగల్ బడావో నినాదం ప్రతీ అటవీ అధికారి, సిబ్బందికి నిత్య జీవితంలో భాగం కావాలని కొత్తగా అటవీ శాఖ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన పీసీసీఎఫ్ ఆర్.ఎం. డోబ్రియల్ అన్నారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అన్ని అటవీ సర్కిళ్లు, అన్ని జిల్లాల అటవీ అధికారులతో అరణ్య భవన్ నుంచి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు.వృత్తి పరమైన క్రమశిక్షణ, నైపుణ్యం పెంపు, నిజాయితీలే పనితీరుకు కొలమానం కావాలని రాష్ట్ర వ్యాప్తంగా అటవీ అధికారులు, సిబ్బందికి సూచించారు. ఉన్న అడవిని కాపాడటం, కొత్తగా పచ్చదనం పెంపు తొలి ప్రాధాన్యత కావాలి అని అన్నారు. అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇచ్చే ప్రభుత్వం ఉన్నందున, పనితీరు మెరుగు పరుచుకుని ఫలితాలు చూపించాల్సిన బాధ్యత అటవీ శాఖ పైనే ఉందని డోబ్రియల్ అన్నారు.


అడవుల రక్షణ, పునరుద్దరణ, అర్బన్ ఫారెస్ట్ పార్కుల పూర్తి, తెలంగాణకు హరితహారం కోసం నాణ్యమైన పెద్ద మొక్కలను అందించటం, అటవీ అనుమతుల్లో వేగం, వన్యప్రాణుల సంరక్షణ, ఎకో టూరిజం పాలసీ, పులుల అభయారణ్యాలను మరింత సమర్థవంతంగా నిర్వహణ, పెరిగిన సాంకేతికత వినియోగం, ఆగ్రో ఫారెస్టీని పెంచటం తన ప్రాధాన్యతలుగా పెట్టుకున్నానని వివరించిన పీసీసీఎఫ్ అందుకు అనుగుణంగా అందరు అధికారులు సిబ్బంది పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా అడవుల క్షేత్ర స్థాయి సందర్శన, పనుల పరిశీలన పెట్టుకోవాలని, తాను కూడా తరచుగా ఫీల్డ్ విజిట్ లు చేస్తానని తెలిపారు. జిల్లా అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. పాలనాపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.వీడియో కాన్ఫరెన్స్ లో పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్ లు ఎం.సీ. పర్గెయిన్, ఏ.కే. సిన్హా, అన్ని సర్కిళ్లకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, అన్నిజిల్లాలకు చెందిన డీఎఫ్ఓలు, ఎఫ్ డీ ఓలు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T01:12:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising