ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయ కారణాలతోనే!

ABN, First Publish Date - 2022-01-27T08:20:18+05:30

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను అఫిడవిట్‌ టాంపరింగ్‌ చేశానన్న కేసులో ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్‌ చేసిన పిటిషన్‌పై రాద్థాంతం చేయడం తగదని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • హైకోర్టు డిస్మిస్‌ చేసిన పిటిషన్‌పై రాద్ధాంతం
  • దీనివెనుక పాలమూరుకు చెందిన 
  • మాజీ ఎంపీ, మాజీ మంత్రి: శ్రీనివాస్‌ గౌడ్‌
  • కేసు డిస్మిస్‌ కాలేదు: పిటిషనర్‌ 


హైదరాబాద్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను అఫిడవిట్‌ టాంపరింగ్‌ చేశానన్న కేసులో ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్‌ చేసిన పిటిషన్‌పై రాద్థాంతం చేయడం తగదని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. కేవలం రాజకీయ కారణాలతోనే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీని వెనుక మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ మాజీ ఎంపీ, ఓ మాజీ మంత్రి, ఓ నాయకుడు ఉన్నారని ఆరోపించారు. ‘మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ మెడకు అఫిడవిట్ల టాంపరింగ్‌ వివాదం’ అంటూ పత్రికల్లో వచ్చిన వార్తలపై ఆయన బుధవారం ఇక్కడ టీఆర్‌ఎ్‌సఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల అఫిడవిట్ల టాంపరింగ్‌ సాధ్యం కాదని చెప్పారు. అయితే శ్రీనివా్‌సగౌడ్‌ పేరున ఉన్న రెండు ఎన్నికల అఫిడవిట్లలో పొందుపర్చిన వివరాలు వేర్వేరుగా ఉండటంపై, ఈసీ కొనసాగిస్తున్న విచారణపైనా ఆయన సూటిగా స్పందించలేదు.  కాగా శ్రీనివా్‌సగౌడ్‌ అఫిడవిట్ల టాంపరింగ్‌ కేసును ఢిల్లీ హైకోర్టు డిస్మిస్‌ చేయలేదని పిటిషనర్‌ రాఘవేంద్రరాజు తెలిపారు. ‘‘శ్రీనివా్‌సగౌడ్‌ ఎన్నికల అఫిడవిట్ల టాంపరింగ్‌పై మొదట తెలంగాణ హైకోర్టును సంప్రదించాం. అయితే వెంటనే కేసు లిస్టు కాలేదు. దీంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాం. పిటిషన్‌ను పరిశీలించిన ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానం.. ఇదే అంశంపై ఇదివరకు తెలంగాణ హైకోర్టును ఆత్రశయించిన నేపథ్యంలో అక్కడికే వెళ్లాలని సూచించింది. దీంతో అక్కడ పిటిషిన్‌ను ఉపసంహరించుకున్నాం’’ అని ఆయన వివరించారు.

Updated Date - 2022-01-27T08:20:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising