ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి కూలీగా సర్పంచ్‌

ABN, First Publish Date - 2022-05-23T09:21:36+05:30

ఆ సర్పంచ్‌ తమ గ్రామం అభివృద్ధి కోసం పరితపించాడు. రూ.3.50లక్షలు అప్పుచేసి మరీ ఊరిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేయించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రూ.3.50 లక్షలు అప్పు చేసి మరీ అభివృద్ధి పనులు.. నిధులివ్వని సర్కారు 
  • వడ్డీ పెరుగుతుండడంతో ‘ఉపాధి’ పనులకు 


సదాశివనగర్‌, మే 22: ఆ సర్పంచ్‌ తమ గ్రామం అభివృద్ధి కోసం పరితపించాడు. రూ.3.50లక్షలు అప్పుచేసి మరీ ఊరిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేయించాడు. బిల్లులు సకాలంలో చేతికందక విలవిలాడుతున్నాడు. ఈ దుస్థితిని కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్‌ మండ లం మర్కల్‌ గ్రామ సర్పంచ్‌ జూకంటి సంగారెడ్డి ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి పనుల కోసం చేసిన అప్పులపై వడ్డీలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో గత్యంతరం లేక ఆయన తన భార్య నాగలక్ష్మితో కలిసి గత నాలుగు రోజులుగా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. గ్రామ పంచాయతీల ఖాతాలపై రాష్ట్ర సర్కారు ప్రస్తుతం ఫ్రీజింగ్‌ విధించింది. ప్రభుత్వం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులు జనవరి నుంచిపెండింగ్‌లోనే ఉన్నాయని సంగారెడ్డి వాపోయారు. ఫలితంగా గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తాను అప్పులు తెచ్చి మరీ గ్రామంలో పనులు చే శానన్నారు. ప్రభుత్వమే సర్పంచ్‌లను ఆదుకోవాలని కోరారు. 

Updated Date - 2022-05-23T09:21:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising