ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

floods: జలదిగ్బంధంలో భద్రాచలం

ABN, First Publish Date - 2022-07-15T22:50:24+05:30

ఎగువన పడుతున్న వర్షాలు.. వాగులు, ఉపనదుల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం: ఎగువన పడుతున్న వర్షాలు.. వాగులు, ఉపనదుల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి (Godavari) ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం భద్రాచలం (Bhadrachalam) జలదిగ్బంధంలో ఉంది. గోదావరి వరదతో నలుదిక్కులా నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం దగ్గర 69.90 అడుగుల మేర గోదావరి నీటి ప్రవాహం కొనసాగుతోంది. గురువారం రాత్రి 11 గంటలకు భద్రాచలం వద్ద 64 అడుగులకు చేరుకున్న గోదావరి ప్రవాహం శుక్రవారం సాయంత్రానికి 69.90 అడుగులకు చేరింది. ఈ నెల 10న భద్రాచలం వద్ద క్రమంగా పెరిగిన గోదావరి ప్రవాహం 11న తుది ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 53.9 అడుగులకు చేరుకుంది. అనంతరం కొన్ని గంటల పాటు నిలకడగా ఉండి తగ్గుముఖం పట్టింది. 12వ తేదీ ఉదయం 51.7అడుగులకు తగ్గి.. క్రమంగా మళ్లీ పెరిగి ఉదయం 6 గంటలకు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 53అడుగులను దాటి 58.5 అడుగులకు వచ్చింది. 15 వ తేది సాయంత్రం అందిన సమాచారం వరకు భద్రాచలం దగ్గర 69.90 అడుగుల మేర గోదావరి నీటి ప్రవాహం కొనసాగుతోంది. 



గోదావరి నది పరివాహక ప్రాంతంలో కురిసిన భారీవర్షాలతో మళ్లీ గోదావరి గత స్వరూపాన్ని చూపుతోంది. ఇప్పటి వరకు గోదావరి చరిత్రలో 30 సార్లకు పైగా మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 53 అడుగులు దాటి గోదావరి ప్రవహించగా.. అందులో 1986 ఆగస్టు 16న భద్రాచలం వద్ద 75.6అడుగుల నీటిమట్టం నమోదైంది. ఈ వరదే గోదావరి వరదల్లో రికార్డు. వందలాది గ్రామాలు జలమయమై ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయాయి. కేవలం రేడియో సమాచారం, హ్యామ్‌ రేడియో సమాచారంతోనే అప్పటి ప్రజలు ఎగువ ప్రాంతాలకు తరలివెళ్లి ప్రాణాలను కాపాడుకున్నారు. పడవలు, లాంచీలు కూడా అందుబాటులో లేని పరిస్థితి. హ్యామ్‌ రేడియో మినహా ఇతర సమాచార వ్యవస్థ అందని పరిస్థితి. వేలాది మంది వరద ముంపుకు గురై పునరావాస కేంద్రాల్లో జీవించారు. 1986 గోదావరి వరదలు మరిచిపోక ముందే 1990లో 70.8 అడుగులు వచ్చింది. 1953లో 72.5 అడుగులు గోదావరి నీటిమట్టం నమోదు అయ్యింది. మళ్లీ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా గోదావరి వరద నీటిమట్టం 1986లో వచ్చిన వరద మళ్లీ వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా సహాయక కార్యక్రమాలు పునరావాస కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - 2022-07-15T22:50:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising