ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వ‌యం స‌హాయ‌క సంఘాలతో Flip kart ఒప్పందం

ABN, First Publish Date - 2022-06-25T20:50:25+05:30

మల్టీ నేషనల్ కంపెనీ Flip kart, స్వయం సహాయక సంఘాలతో(self help groups) ఒప్పందం చేసుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli dayakar rao)అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మల్టీ నేషనల్ కంపెనీ Flip kart, స్వయం సహాయక సంఘాలతో(self help groups) ఒప్పందం చేసుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli dayakar rao)అన్నారు.తెలంగాణ సాధించిన విషయాల్లో ఇదొక విజయమని ఆయన ప్రశంసించారు. శనివారం ఎంసిహెచ్ఆర్డిలో జరిగిన కార్యక్రమంలో ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ దేశంలోనే ఇది మొదటి ఒప్పందమని అన్నారు.ఈ ఏడాది 500 కోట్ల వ్యాపార లక్ష్యంతో ఈ ఒప్పందం ఫ్లిప్ కార్ట్ తో కుదిరిందని తెలిపారు. వాళ్ళ తో ప్రయాణం తప్పకుండా మన మ‌హిళా సంఘాల‌కు లాభం చేకూరుతుందన్నారు.నీళ్ళు, 24 గంటల కరెంట్ వచ్చింది. దండుగలా ఉన్న వ్యవసాయం పండుగలా మారింది.వ్య‌సాయం, ప‌రిశ్ర‌మ‌లు ప‌చ్చ‌గా ఉన్నాయి.సాగు దిగుబ‌డి పెరిగింది. 


సాగు, వ్య‌వ‌సాయోత్ప‌త్తులు, ఇత‌ర ఉత్ప‌త్తుల రంగంలోకి మ‌హిళ‌లు వ‌చ్చారు.మహిళా సంఘాలు ముందుకు రావడం వల్ల దళారుల వ్యవస్థకు బ్రేక్ పడిందన్నారు. మ‌హిళ‌లు నాణ్యమైన వస్తువులు తయారు చేస్తున్నారు.మహిళా సంఘాలు మన తెలంగాణ లో ఉండటం, నేను ఆ శాఖకు మంత్రిగా ఉండటం గర్వంగా ఉందన్నారు మహిళా సంఘాలకు వారి ఉత్పత్తులకు మంచి లాభం జరుగుతుందని,మనకు మన మహిళలే ఆదర్శమని ఎర్రబెల్లి పేర్కొన్నారు.మన రాష్ట్రంలో ఇంకా అనేక పంటలు పండుతున్నాయి.వాటికి కూడా మార్కెటింగ్ జరిగే విధంగా చూడాలన్నారు. 


మహిళలను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.మహిళల వద్ద రికవరీ గ్యారంటీ 100 శాతం ఉంటుంది. వారు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పారు.వ్యాపారంలో కూడా వారి చొరవ, శక్తి, శ్రమ బాగా ఉపయోగపడుతున్నాయన్నారు. మహిళల్లో ఇంత చైతన్యం రావడానికి కారణం మహిళా సంఘాలేనని, గ్రామాల్లో మహిళలు అంటే ఒక నమ్మకం పెరిగిందన్నారు.బ్యాంకులు ఎలాంటి గ్యారంటీ లేకుండానే మ‌హిళ‌ల‌కు రుణాలు ఇవ్వ‌డానికి ముందుకు వ‌స్తున్నాయన్నారు.గ‌త ఏడాది 15వేల కోట్ల రుణాలు ఇచ్చాం.ఈ ఏడాది 18వేల కోట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించామని మంత్రి తెలిపారు.లోన్లు తీసుకొని ఇంటి అవసరాలు తీర్చుకోవడం కాదు, వ్యాపారాలు చేయడానికి ప్రయత్నించండి.సీఎం కేసిఆర్ కూడా మహిళల సాధికారత ను కోరుకుంటున్నారని అన్నారు.

Updated Date - 2022-06-25T20:50:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising