ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేప పిల్ల.. గోల్‌మాల్‌ మళ్లా!

ABN, First Publish Date - 2022-08-25T08:20:24+05:30

అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిన ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ పథకంలో తాజాగా మరో గోల్‌మాల్‌ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెండర్లలో కాంట్రాక్టర్ల మాయాజాలం.. నకిలీ బ్యాంకు గ్యారెంటీ పత్రాల సమర్పణ

విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం


హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిన ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ పథకంలో తాజాగా మరో గోల్‌మాల్‌ జరిగింది. చేప పిల్లలు సరఫరా చేసే టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లలో కొందరు నకిలీ బ్యాంకు గ్యారెం టీ పత్రాలు సమర్పించి మత్స్యశాఖకు మస్కా కొట్టిన ట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు మత్స్యశాఖ కమిషనరేట్‌ నుంచి సంబంధిత బ్యాంకులకు లేఖలు రాసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాతే టెండర్లు ఖరా రు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటం తో మత్స్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు. మ త్స్యశాఖ ద్వారా ఈ ఏడాది 26,778 నీటి వనరుల్లో 68 కోట్ల చేప పిల్లలు, మరో 275 నీటి వనరుల్లో 10 కోట్ల రొయ్య పిల్లలను విడిచి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను రూ. 113 కోట్ల అంచనా వ్య యంతో ప్రతిపాదనలు రూపొదించారు. వచ్చే సెప్టెంబ రు మొదటి వారం నుంచి చేప, రొయ్య పిల్లలు పం పిణీ చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. ఈ క్రమంలో జిల్లాల వారీగా టెండర్లు పిలిచారు. పలువురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. నెగోషియేషన్‌ చేసిన తర్వాత 83 టెండర్‌ బి డ్లు తుది జాబితాలోకి వచ్చాయి.


అయితే చేపలు, రొయ్య పిల్లల టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్లు... టెండరు అలాట్‌మెంట్‌ విలువలో 5 శాతం డబ్బును బ్యాంకు గ్యారెంటీ, డీడీ, ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. అదేక్రమంలో 10 శాతం కంటే త క్కువకు టెండరు దాఖలు చేస్తే... 25 శాతం మొత్తాన్ని అడిషనల్‌ పర్‌ఫార్మెన్స్‌ గ్యారెంటీ కింద చెల్లించాల్సి ఉం టుంది. అయితే, కొందరు కాంట్రాక్టర్లు నకిలీ బ్యాంకు గ్యారెంటీ పత్రాలు సృష్టించి.. మత్స్యశాఖకు సమర్పించినట్లు వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వం.. ఏ జిల్లాలో నకిలీ పత్రాలు తయారు చేశారు? ఏ బ్యాం కుల డాక్యుమెంట్లు నకిలీవి సమర్పించారు? ఏ కాం ట్రాక్టర్లు అవి దాఖలు చేశారో విచారించాలని మత్స్యశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో విచారణ మొదలుపెట్టిన అధికారులు.. కాంట్రాక్టర్లు సమర్పించిన బ్యాంకు గ్యారెంటీ పత్రాలు అసలి వా? నకిలీవా? అని తేల్చేందుకు ఆయా బ్యాంకులకు లేఖలు రాశారు. బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమో దు చేస్తామని, వారి టెండర్లు రద్దు చేస్తామని మత్స్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. 


అన్ని జిల్లాల్లోనూ విచారణ 

ఆరోపణలు వచ్చిన జిల్లాలే కాకుండా. అన్ని జిల్లాల్లోనూ విచారణ చేపట్టాలని అధికారులు నిర్ణయించా రు. మొత్తం 83 మంది బిడ్డర్లకు సంబంధించిన పత్రా ల పరిశీలన తర్వాతే... టెండర్లను ఖరారు చేస్తామని, ఆ తర్వాతే చేప, రొయ్య పిల్లల పంపిణీ బాధ్యతలు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-08-25T08:20:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising