ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలం సాగర్‌ నిర్వహణ మార్గదర్శకాలను ఖరారు చేయండి

ABN, First Publish Date - 2022-03-05T06:56:58+05:30

1005 టీఎంసీల జలాలను తెలుగు రాష్ట్రాలకు పునర్‌ పంపిణీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  బ్రిజేశ్‌ ట్రైబ్యునల్‌ను కోరనున్న తెలంగాణ


హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): 1005 టీఎంసీల జలాలను తెలుగు రాష్ట్రాలకు పునర్‌ పంపిణీ చేసే బాధ్యతలు చూస్తున్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణ మార్గదర్శకాలను ఖరారు చేయాలని జస్టిస్‌ బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం కోరనుంది. ఈ మేరకు ట్రైబ్యునల్‌లో విజ్ఞప్తిని సమర్పించనుంది. నీటి కేటాయింపుల తర్వాత అత్యంత కీలకమయినవి ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌ (నిర్వాహణ మార్గదర్శకాలు), రూల్‌ కర్వ్‌లే. ఏ సమయంలో ప్రాజెక్టు నిర్వహణలో గేట్లు ఎత్తాలి? జలవిద్యుదుత్పత్తికి కనీస నీటి మట్టం ఎంత? తాగునీటికి ఎంత...? సాగునీటికి ఎక్కడిదాకా నీటిమట్టం ఉంచాలి? వంటివి నిర్వహణా మార్గదర్శకాలు నిర్దేశించనుండగా... ఏ నెలలో ప్రాజెక్టుల్లో ఏ మేర నీటి నిల్వ ఉంచాలనేది రూల్‌ కర్వ్‌ స్పష్టం చేస్తోంది.


2013లో బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ కృష్ణా జలాలను మూడు రాష్ట్రాలకు (మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు) పంచింది. తీర్పు అమలు కాకుండా సుప్రీంకోర్టులో కేసు దాఖలు కావడంతో బ్రిజేష్‌ తీర్పుపై న్యాయస్థానం స్టే విధించింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో... ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటిని పంచే బాధ్యతను బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌కు అప్పగించారు. మార్చి 31వ తేదీ వరకు బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌లో విచారణ జరగనుంది. ఈలోగా ట్రైబ్యునల్‌లో విజ్ఞప్తిని దాఖలు చేయాలని తెలంగాణ నిర్ణయించింది. 


Updated Date - 2022-03-05T06:56:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising