ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఎస్‌ ఉద్యోగులకు కుటుంబ పెన్షన్‌

ABN, First Publish Date - 2022-08-31T08:36:58+05:30

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌) ఉద్యోగుల కుటుంబ సభ్యులకు పెన్షన్‌ పథకం అమలు కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విధివిధానాల జారీ.. 

హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌) ఉద్యోగుల కుటుంబ సభ్యులకు పెన్షన్‌ పథకం అమలు కానుంది. మరణించిన ఉద్యోగుల విషయంలో వారి కుటుంబ సభ్యులకు, మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌ అయినవారి విషయంలో ఉద్యోగులకు ప్రతి నెలా కుటుంబ పెన్షన్‌ అందనుంది. దీనికి సంబంధించిన విధివిధానాల ఉత్తర్వులను డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ కేఎ్‌సఆర్‌సీ మూర్తి మంగళవారం జారీ చేశారు. వాస్తవానికి సీపీఎస్‌ ఉద్యోగులకు ఇదివరకు కుటుంబ పెన్షన్‌ ఉండేది కాదు. కానీ... ‘తెలంగాణ రాష్ట్ర సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం(టీఎ్‌ససీపీఎ్‌సఈయూ)’ చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తూ 2021 జూన్‌ 11న జీవో నంబర్‌ 58 జారీ చేసింది. దీనికి సంబంధించి విధివిధానాలను మాత్రం జారీ చేయకపోవడంతో అప్పటి నుంచి సీపీఎస్‌ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం వాటిని జారీ చేసింది. నిబంధనల ప్రకారం సీపీఎస్‌ ఉద్యోగుల మూల వేతనం, డీఏ నుంచి 10ు, ప్రభుత్వం నుంచి 10ు చొప్పున కాంట్రిబ్యూషన్‌ సొమ్మును ప్రతి నెలా ‘నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌’ ట్రస్టులోని ఉద్యోగి ‘పర్మినెంట్‌ రిటైర్మెంట్‌ అకౌంట్‌ నెంబర్‌(ప్రాన్‌)’లో జమ చేస్తుంటారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌ అయిన ఉద్యోగులు.. ప్రాన్‌లోని ఈ సొమ్ము మొత్తాన్ని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తున్నట్లు లేఖ ఇస్తే, అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం వారికి పెన్షన్‌ అనుమతి పత్రాన్ని జారీ చేస్తుంది. అనంతరం వారికి పెన్షన్‌ పథకం అమలవుతుంది. అయితే... ఈ పెన్షన్‌ స్కీమ్‌ ఎప్పటి నుంచి అమలవుతుందన్న వివరాలను ప్రభుత్వం స్పష్టం చేయకపోయినా.. 58 జీవో అమల్లోకి వచ్చిన 2021, జూన్‌ 11 నుంచి వర్తిస్తుందనే అభిప్రాయాన్ని ఉద్యోగులు వ్యక్తం చేశారు. ఈ మేరకు 14 నెలల బకాయిలను ప్రభుత్వం చెల్లించే అవకాశాలున్నాయని చెప్పారు. 


వీరికి అమలు..

ప్రాన్‌ ఉండి కాంట్రిబ్యూషన్‌ జమకాని ఉద్యోగులు, ప్రాన్‌ లేకుండానే కాంట్రిబ్యూషన్‌ రికవరీ అయినవారు, ప్రాన్‌ ఉండి కాంట్రిబ్యూషన్‌ కూడా రికవరీ అయిన ఉద్యోగులతో పాటు కనిపించకుండాపోయిన(అబ్‌స్కాండింగ్‌) ఉద్యోగుల విషయంలో కుటుంబ పెన్షన్‌ను అమలు చేయడానికి అనుసరించాల్సిన విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధివిధానాలను పరిగణలోకి తీసుకుని, పెన్షన్‌ను అమలు చేయాలంటూ హైదరాబాద్‌ పెన్షన్‌ పేమెంట్‌ ఆఫీస్‌ జాయింట్‌ డైరెక్టర్‌, జిల్లాల్లోని ట్రెజరీ ఆఫీసర్లను ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ డైరెక్టర్‌(నోడల్‌ ఆఫీసర్‌) ఆదేశించారు. 2004 సెప్టెంబర్‌ 1 నుంచి సీపీఎస్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. అప్పటి నుంచి చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు, మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌ అయిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. కాగా.. తమ విజ్ఞప్తి మేరకు విధివిధానాలను జారీ చేసిన ప్రభుత్వానికి.. తెలంగాణ స్టేట్‌ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్థితప్రజ్ఞ, శ్రీకాంత్‌ కృతజ్ఞతలు తెలిపారు.


తప్పుడు విధానం

సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించిన కుటుంబ పెన్షన్‌ స్కీమ్‌ తప్పుడు విధానమని సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దాముక కమలాకర్‌ ఆరోపించారు. ప్రాన్‌ అకౌంట్‌లో ఉద్యోగి నుంచి 10ు, ప్రభుత్వం నుంచి 10ు చొప్పున కాంట్రిబ్యూషన్‌ సొమ్ము జమ అవుతుంటుందని, ఇలా జమ అయిన మొత్తం సొమ్మును ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తేనే కుటుంబ పెన్షన్‌ వర్తిస్తుందని చెప్పడం తప్పుడు విధానమని తెలిపారు. తమ వాటా సొమ్మును తమకు ఇచ్చి, ప్రభుత్వ కాంట్రిబ్యూషన్‌ సొమ్ము నుంచి మాత్రమే పెన్షన్‌ను అమలు చేస్తే ఉద్యోగికి మేలు జరుగుతుందని వివరించారు. 


సీపీఎస్‌ను రద్దు చేయాలి: టీచర్‌ ఘాలు

కాంట్రిబ్యూటరి పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని.. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి, సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు సదానందగౌడ్‌, మహిపాల్‌రెడ్డి, వెంకటేశం తదితరులు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-08-31T08:36:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising