రాజీవ్ గృహకల్పలో దారుణం.. ఇద్దరు పిల్లలు సహా కుటుంబం ఆత్మహత్య..!
ABN, First Publish Date - 2022-10-17T15:16:14+05:30
చందానగర్‌లోని రాజీవ్ గృహకల్పలో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్లుగా ఇక్కడే నివాసముంటున్న
హైదరాబాద్ : చందానగర్‌లోని రాజీవ్ గృహకల్ప (Rajiv Gruhakalpa)లో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్లుగా ఇక్కడే నివాసముంటున్న కుటుంబం ఏమైందో ఏమైందో కానీ ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల్లో భార్యాభర్త.. ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత శుక్రవారం నుంచి తలుపులు వేసే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. కాగా నేటి ఉదయం ఇంటి నుంచి దుర్గంధం రావడంతో స్థానికులు వెళ్లి తలుపు కొట్టారు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో తలుపులు పగులగొట్టి స్థానికులు లోపలికి వెళ్లి చూసి అవాక్కయ్యారు. ఇంట్లో నాగరాజు, సుజాత దంపతులతో పాటు వారి పిల్లలు రమ్యశ్రీ, టిల్లు విగత జీవులుగా కనిపించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసకుని దర్యాప్తు ప్రారంభించారు.
Updated Date - 2022-10-17T15:16:14+05:30 IST