ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెట్టింగ్ మోజులో పడి బంగారం స్వాహా

ABN, First Publish Date - 2022-02-17T00:54:03+05:30

బెట్టింగ్ మోజులో పడి తాను పనిచేస్తున్న సంస్థలోని 14.40 కిలోల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బెట్టింగ్ మోజులో పడి తాను పనిచేస్తున్న సంస్థలోని 14.40 కిలోల బంగారాన్ని ఓ ప్రబుద్దుడు స్వాహా చేశాడు. ఈ ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. ఐఐఎఫ్‌ఎల్ సంస్థలో గోల్డ్ లోన్ బంగారాన్ని భద్రపరిచే వాల్ట్ అపరేషన్‌గా రాజ్‌కుమార్ అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు. అయితే బెట్టింగ్ వ్యసనానికి అలవాటు పడిన రాజ్ కుమార్ 1*bet ద్వారా ఆన్లైన్‌లో బెట్టింగ్‌కు పాల్పడ్డాడరు. ప్రతి బాల్‌పై లక్ష పందెం వేశాడు. సంస్థలో ఉన్న బంగారాన్ని తనాఖా పెట్టి 3 కోట్లతో బెట్టింగ్‌కు పాల్పడ్డాడు. అయితే సంస్థ ఆడిటింగ్‌లో ఈ మోసం బయట పడింది. ఆడిటింగ్ సమయంలో 14.40 కిలోల బంగారం మాయం అయినట్టు సిబ్బంది గుర్తించారు. దీంతో కీసర పోలీసులకు సంస్థ ప్రతినిదులు ఫిర్యాదు చేశారు. రాజ్ కుమార్‌తో పాటు మరికొందరి హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం 38 మంది పేర్లపై ఉన్న బంగారాన్ని మణప్పురం గోల్డ్ లోన్‌ సంస్థలో తనఖా పెట్టాడు. రాజ్ కుమార్‌ను కీసర పోలీసులు అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  


Updated Date - 2022-02-17T00:54:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising