ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌కు గిరిజన జాతి రుణపడి ఉంటుంది

ABN, First Publish Date - 2022-10-03T05:34:32+05:30

కేసీఆర్‌కు గిరిజన జాతి రుణపడి ఉంటుంది

మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ సీతారాంనాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 10శాతం రిజర్వేషన్‌ పెంచడం హర్షనీయం 

 మాజీ ఎంపీ సీతారాంనాయక్‌

హనుమకొండ టౌన్‌, అక్టోబరు 2: సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యం కాని గిరిజనుల రిజర్వేషన్‌ను సుసాధ్యం చేసిన సీఎం కేసీఆర్‌కు గిరిజన జాతీ రుణపడి ఉంటుందని, 6 నుంచి 10 శాతం రిజర్వేషన్‌ పెంచడం హర్షణీయమని మాజీ ఎంపీ  సీతారాంనాయక్‌ తెలిపారు. ఆదివారం హనుమకొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీతారాంనాయక్‌ మాట్లాడారు. 36 యేళ్లుగా గిరిజనులు రిజర్వేషన్‌లు పెంచలేదని ఆరోపించారు. ఉద్యమ సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు ఒక కమిషన్‌ నియమించి గిరిజనుల స్థితిగతుల గురించి నివేదిక కోరిందన్నారు. కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా సమగ్ర కుటుంబ సర్వే మేరకు 2017లో 6నుంచి 10శాతం గిరిజనుల రిజిర్వేషన్‌ పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. ఈ విషయమై తమ పార్టీ ఎంపీలందరూ బిల్లును ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. 

ఇప్పుడు సీఎం కేసీఆర్‌ గిరిజనుల రిజర్వేషన్‌ పెంచడంతో పాటు హైదరాబాద్‌లో రూ.25కోట్లు వెచ్చించి బంజారా భవనం నిర్మించడం గర్వకారణమన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తండాలను పంచాయతీలుగా మారామని, విదేశాల్లో ఉన్నత విద్యకు రూ.20లక్షలు, గురుకుల పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రూ.1లక్ష 20వేలు, కళ్యాణలక్ష్మీలాంటి పలు పథకాలు వర్తింప చేస్తున్నట్లు పేర్కొన్నారు. గిరిజన బంధు సైతం ఇవ్వనున్నట్లు కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గిరిజన జాతి అండగా ఉంటుందని సీతారాంనాయక్‌ పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమానికి కేసీఆర్‌ చేస్తున్న కార్యక్రమాలను చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు గిరిజన జాతుల మధ్య తగాదాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. విలేకర్ల సమావేశంలో గిరిజన సంఘాల నేతలు రూప్‌శంకర్‌, పూల్‌సింగ్‌, సదర్‌లాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-03T05:34:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising