ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana agriculture తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ విధానాలు భేష్

ABN, First Publish Date - 2022-05-22T21:19:59+05:30

తెలంగాణవ్యవసాయ విధానాలు భేష్ గా వున్నాయని, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు(vadde shobhanadishwar rao) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణవ్యవసాయ విధానాలు భేష్ గా వున్నాయని, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు(vadde shobhanadishwar rao) అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు అనుకూల పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు.ఆదివారం మంత్రుల నివాస సముదాయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ వ్యవసాయ శాఖా మంత్రి, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వర రావు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని(singi reddy niranjan reddy) కలిశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల వైవిధ్యీకరణ తప్పనిసరి అని వరి సాగు నుండి పప్పు, నూనె గింజల సాగు వైపు మళ్లాలని అన్నారు.ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం రైతాంగాన్ని ప్రోత్సహించడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు.1985-1989 మధ్యకాలంలో నూనెగింజలు - అపరాల సాంకేతిక మిషన్ పథకం తరహాలో ప్రస్తుతం అపరాలు, నూనె, పప్పుగింజల సాగుకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు.


ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు.విదేశీ ఎగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమైన వసతులు కల్పించాలని, వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించి అధికధర పొందడానికి చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు మహిళా  రైతు ఉత్పత్తి సంస్థలకు సహకారం అందించాలని సూచించారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ మద్దతుధరల విషయంలో అవలంబిస్తున్న  లోపభూయిస్ట  విధానాల మూలంగా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని శోభనాదీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు పంట ఉత్పత్తులకు c2+50 ఫార్మూలా ప్రకారం కనీస మద్దతుధర లభించేలా చట్టబద్దత కల్పించినపుడే రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు. 


ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుపుకుని వ్యవసాయం విషయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ అనుసరిస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యతిరేకంగా ఉన్న నియమాలలో మార్పు తీసుకు రావడానికి కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలన్నారు.అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా డంకెల్ డ్రాఫ్ట్ రచించుకుని ఆయా దేశాల ఉత్పత్తులకు అధిక ధరలు వచ్చేలా, ఆయా దేశాల రైతులు లాభపడేవిధంగా విధానాలు రూపొందించుకున్నారని తెలిపారు.

Updated Date - 2022-05-22T21:19:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising