ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధనుర్మాసోత్సవాలకు సర్వం సిద్ధం

ABN, First Publish Date - 2022-12-15T00:31:56+05:30

రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఈ నెల 16వ తేదీ శుక్రవారం సాయంత్రం ధనుర్మాసోత్సవాలకు శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో శ్రీకారం చుట్టనున్నారు. ఆరోజు సాయంత్రం వేళ 6.17గంటలకు ధనుర్మా సం ఆరంభంకానుండడంతో నాటి నుంచి 30 రోజులపాటు ఆం డాళ్‌ అమ్మవారు ఆచరించిన తిరుప్పావై (శ్రీవ్రత) పూజలను సం ప్రదాయరీతిలో నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

30 రోజులపాటు తిరుప్పావై వ్రతపూజలు

ఏకశిఖరవాసుడి సన్నిధిలో రేపటి నుంచి ఉత్సవాలు

యాదగిరిగుట్ట, డిసెంబరు14: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఈ నెల 16వ తేదీ శుక్రవారం సాయంత్రం ధనుర్మాసోత్సవాలకు శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో శ్రీకారం చుట్టనున్నారు. ఆరోజు సాయంత్రం వేళ 6.17గంటలకు ధనుర్మా సం ఆరంభంకానుండడంతో నాటి నుంచి 30 రోజులపాటు ఆం డాళ్‌ అమ్మవారు ఆచరించిన తిరుప్పావై (శ్రీవ్రత) పూజలను సం ప్రదాయరీతిలో నిర్వహించనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 2023 జనవరి 15వ తేదీ వరకు తిరుప్పావై వేడుకలు కొనసాగనున్నాయి. ధనుర్మాసంలో మహిళలు ప్రతీరోజు ప్రభాత వేళ గోదాదేవి(ఆండాళ్‌) అమ్మవారిని కొలుస్తూ తిరుప్పావై పాశురపఠనంచేసి మంగళహారతులతో నీరాజనాలు సమర్పిస్తే సకల కోర్కెలు నెరవేరుతాయని, ముఖ్యంగా యువతులకు వి వాహ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. జగత్‌ కల్యాణకారకుడు శ్రీమన్నారాయణుడు(శ్రీరంగనాథుని) పరిణయమాడేందుకు ఈనెలలో 30 రోజుల పాటు తిరుప్పావై పాశుర పఠనాలతో కొలిచి పరిణయమాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీంతో శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఆండాళ్‌ అమ్మవారు ఆలపించిన తిరుప్పా వై పశుర పఠనాలతో ఈ మాసమంతా ప్రభాతవేళ ప్రత్యేకపూజలు నిర్వహించ డం అనాదిగా వస్తున్న సంప్రదాయం. యాదగిరిక్షేత్రంలో తిరుప్పావై వేడుకలను నెల రోజులపాటు జరిపి చివరి రోజున గోదాకల్యాణపర్వాలు శాస్త్రోక్తంగా నిర్వహించి మరుసటి రోజున ఆండాళ్‌ అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించడం అనాథిగా వస్తున్న ఆచారం. ఇందుకోసం దేవస్థాన అధికారులు, అర్చకబృందం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపట్టి ధనుర్మాసపర్వాలను నిర్వహిస్తారు. అయితే సాయంత్రం వేళ సూర్యుడు ధనుర్‌రాశిలో ప్రవేశంతో ధనుర్మాసం ఆరంభం కానుండడం తో సంప్రదాయరీతిలో తిరుప్పావై వేడుకలకు శ్రీకారం పలికి మొదటి పాశుర పఠనం జరిపి విశేష నివేదనలు చేస్తారు. కాగా ఈ మాసంలో ప్రత్యేకంగా పొం గలి ప్రసాదాన్ని, విశేష రోజుల్లో సిరా, చక్కెర పొంగలి, కూడారై పాశురం రోజున పాలతో ప్రసాదాన్ని తయారు చేసి వెండి గంగాళంలో అమ్మవారికి నివేదిస్తారు.

స్వయంభువుల సన్నిధిలో ధనుర్మాసోత్సవాలు

ఆలయ పునర్నిర్మాణ పనుల కారణంగా ఆరేళ్లుగా తాత్కాలిక బాలాలయంలో కొనసాగిన ధనుర్మాసోత్సవాలు ఈ ఏడాది ప్రధానాలయంలో కొనసాగనున్నాయి. ఆలయ ఉద్ఘాటన అనంతరం ప్రతీ వేడుక, ఉత్సవాలను పాంచనారసింహుడు కొలువుదీరిన ప్రధానాలయంలోనే నిర్వహిస్తున్నారు.

ఆధ్యాత్మిక సమాహారం ధనుర్మాసం : డాక్టర్‌ నల్లన్‌థిఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యు లు, యాదగిరిగుట్ట దేవస్థాన ప్రధానార్చకుడు

ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 19న స్వాతీ నక్షత్ర వేడుకలు, ఏకాదశి లక్ష పుష్పార్చన, 2022 జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సరాది, జనవరి 2వ తేదీన ముక్కోటి (వైకుంఠ)ఏకాదశి, లక్షపుష్పార్చనతోపాటు వార్షిక అధ్యయనోత్సవాలకు శ్రీకారం జరగనుంది. కాగా జనవరి 14వ తేదీ భోగి పండుగ, రాత్రి 7 గంటలకు గోదా కల్యాణమహోత్సవాలతో శ్రీవ్రత పూజలు పరిసమాప్తమవుతాయి.మరుసటి రోజు 15వ తేదీన ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. అదేరోజు మకర సం క్రాంతి, ఆండాళ్‌ అమ్మవారికి ఒడి బియ్యం సమర్పణపర్వాలు ఉదయం 11.30గంటల నుంచి కొనసాగుతా యి. కాగా 16న కనుమ, స్వామి జన్మనక్షత్రం స్వాతి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి.

అంగరంగ వైభవంగా ధనుర్మాస వేడుకలు : యన్‌.గీతారెడ్డి, దేవస్థాన ఈవో

ప్రధానాలయ ఉద్ఘాటన జరిగిన తర్వాత అన్ని విశేష వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం ధనుర్మాస వేడుకలు వైభవంగా చేపట్టేందుకు సర్వం సిద్ధం చేస్తున్నాం. ప్రభాతవేళ ఆసక్తి కలిగిన మహిళాభక్తులను ప్రధానాలయంలోనికి అనుమతించనున్నాం. తిరుప్పావైపర్వాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడారై ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్ణయించాం.

Updated Date - 2022-12-15T00:32:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising