ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాస్ అక్రమాలు ఉపెక్షించేది లేదు: పౌరసరఫరాల ఎన్ ఫోర్స్ మెంట్ డిటీ

ABN, First Publish Date - 2022-01-27T23:37:49+05:30

గృహ వినియోగ వంట గ్యాస్ ను ఇళ్లకు మాత్రమే సకాలంలో డెలివరీ చేయాలనీ, ఈ భాధ్యత ఆయా ఏజెన్సీలదే నని పౌరసరఫరాల శాఖనల్గొండ జిల్లా ఎన్ పోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్ధార్ మాచన రఘునందన్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవర కొండ: గృహ  వినియోగ వంట గ్యాస్ ను ఇళ్లకు మాత్రమే సకాలంలో డెలివరీ చేయాలనీ, ఈ భాధ్యత  ఆయా ఏజెన్సీలదే నని పౌరసరఫరాల శాఖనల్గొండ జిల్లా ఎన్ పోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్ధార్ మాచన రఘునందన్ పేర్కొన్నారు. ఒక వేళ తమ సేవల విషయం లో డీలర్లు ఉదాసీనత, అలసత్వం తో నిర్లక్ష్యం గా ఉంటే కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే గృహ వినియోగ  గ్యాస్ ను కమర్షియల్ వినియోగానికి సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం ఆయన దేవర కొండ లో ఉన్న గ్యాస్ ఏజన్సీ నీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనిఖీ సందర్భంగా కొందరు వినియోగ దారులు అసలు తమకు డోర్ డెలివరీ ఆన్న మాట కు అర్థం తెలియదు అన్నంతగా ఏజెన్సీ వారి సేవలు భాద్యతా రాహిత్యం గా ఉన్నాయని అన్నారు.


దేవర కొండ , కొండ మల్లె పల్లి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తాము ఎక్కువ గా ఏజన్సీ కే వచ్చి గ్యాస్ తీసుకు పోతామని చెప్పడం, ఎక్కువ మంది గ్యాస్ బండలు హోటళ్ల లో కనపడటంచూస్తే, గృహ వినియోగదారులకు ఎలాంటి  సేవలు అందుతున్నాయో సులువుగా అర్థం చేసుకోవచ్చన్నారు. గ్యాస్ ఏజెన్సీ లో రీఫీల్ లు ఏ రోజు వరకు బుక్ అయ్యాయి? ఎన్ని డెలివరీ అయ్యాయి.ఇంకా ఎన్ని పంపిణీ కావాల్సి ఉంది ఇత్యాది అంశాల్ని రఘునందన్ నిశితంగా పరిశీలించారు.


వినియోగదారులు రశీదు మీద ఉన్న మొత్తం మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేశారు.ఒక వేళ అధికంగా అడిగినా సకాలం లో డోర్ డెలివరీ చెయ్యక పోయినా స్థానిక తాసిల్దార్ కు, పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పారు.గ్యాస్ ఏజెన్సీ నిర్వహణ ఓ గొప్ప సేవా అవకాశం అని , అట్టి సేవల విషయంలో కనీస భాధ్యత, నాణ్యత విస్మరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Updated Date - 2022-01-27T23:37:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising