ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిశ నిందితుడిని కుటుంబంలో విషాదం

ABN, First Publish Date - 2022-06-13T01:15:23+05:30

తన కొడుకును అన్యాయంగా చంపారని ఆ తండ్రి ఆక్రోషించాడు. న్యాయం కోసం మూడు ఏళ్లపాటు ఆయన ఎక్కని గడప..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తన కొడుకును అన్యాయంగా చంపారని ఆ తండ్రి ఆక్రోషించాడు. న్యాయం కోసం మూడు ఏళ్లపాటు ఆయన ఎక్కని గడప.. తొక్కని వాకిలి లేదు. తన కొడుకును పోలీసులు పథకం ప్రకారమే హత్య చేశారని నిర్ధారణవ్వడంతో తన కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఎంతగానో పొంగిపోయాడు. న్యాయాన్ని కళ్ల చూడకుండానే తనువు చాలించాడు. దిశ కేసులో నిందితుడైన జోళ్ల శివ కుటుంబంలో విషాదం ఆవిరించింది. శివ తండ్రి రాజప్ప మృతి చెందాడు. ఇదే కేసులో నిందితుడైన చెన్నకేశవులు తండ్రి కురమయ్య రోడ్డు మృతి చెందాడు. కొడుకుల్ని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఈ కుటుంబాలున్నాయి. న్యాయం జరగాలని మూడు సంవత్సరాల నుండి పోలీస్ స్టేషన్‌లు కోర్టుల చుట్టూ ఆ  కుటుంబాలు తిరిగాయి. ఆర్థిక కారణాలు, అనారోగ్య సమస్యలు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక జోళ్ల రాజప్ప మృతి చెందాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. ఎన్‌కౌంటరైన నలుగురు నిందితులను పోలీసులే కాల్చి చంపారని సుప్రీంకోర్టు నియమించిన సిర్పుర్కర్‌ కమిషన్‌ నిర్ధారించింది. నివేదిక తర్వాత నిందితుడు కుటుంబంలో పెద్ద దిక్కు చనిపోవడంతో విషాదం నెలకొంది. ఎన్‌కౌంటర్ బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని అందరూ భావించారు. ఇంతలోనే ఇద్దరు నిందితుల కుటుంబంలో రెండు మరణాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి.


2019 నవంబరు 27 రాత్రి హైదరాబాద్‌ శివారులో బెంగళూరు హైవే మీద రోడ్డు పక్కన లారీ ఆపి మద్యం తాగుతున్న నలుగురు యువకులు అక్కడ బైక్‌ పార్క్‌ చేసిన మహిళా వెటర్నరీ డాక్టర్‌ను కిడ్నాప్‌ చేసి, అత్యాచారానికి పాల్పడి, పెట్రోల్‌ పోసి కాల్చిచంపిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. దిశ హత్య దేశవ్యాప్తంగా ఎంత సంచలానానికి కేంద్రం అయిందో.. దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం అంతే వివాదమైంది. ఎన్‌కౌంటరైన నలుగురు నిందితులను పోలీసులే కాల్చి చంపారని సుప్రీంకోర్టు నియమించిన సిర్పుర్కర్‌ కమిషన్‌ నిర్ధారించింది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 10 మంది పోలీసులపై ఐపీసీ సెక్షన్‌ 302 ప్రకారం హత్య కేసులు నమోదు చేయాలని జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ సిఫారసు చేసింది. ఎన్‌కౌంటర్‌పై పోలీసులు చెప్పిందంతా కట్టుకథేనని స్పష్టం చేసింది. 


ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నది ఏ మాత్రం నమ్మశక్యంగా లేదని, ఐపీసీ 76, ఐపీసీ 300(3)కింద వారు మినహాయింపు పొందలేరని కమిషన్‌ స్పష్టం చేసింది. పది మంది పోలీసు అధికారులపై ఐసీపీ 302, 201, 34 సెక్షన్ల కింద హత్యానేరం కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసింది. నిందితుల గుర్తింపు, అరెస్టు సమయాల్లో పోలీసులు అనేక రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన హక్కులను ఉల్లంఘించారని తేల్చింది. నిందితులను ఎందుకు అరెస్టు చేస్తున్నారో వారి కుటుంబ సభ్యులకు చెప్పలేదని, వారెంట్‌ ఇవ్వలేదని, న్యాయ సాయం అందించలేదని ప్రస్తావించింది.

Updated Date - 2022-06-13T01:15:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising