ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీలకు విద్యుత్‌ షాక్‌ !

ABN, First Publish Date - 2022-12-16T02:57:02+05:30

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : అసలే అరకొర నిధులు, ఆర్థిక ఇబ్బందులు.. పైగా మూడు మాసాలుగా అందని రాష్ట్ర ప్రభుత్వ నిధులు.. ఆపై తడిసి మోపెడవుతున్న విద్యుత్‌ బిల్లులు.. చెల్లించలేక లబోదిబోమంటున్న పంచాయతీలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరిగిన యూనిట్‌ చార్జీలతో మరింత భారం .. ప్రతి నెలా దాదాపు రూ.50 కోట్ల చెల్లింపులు

3 మాసాలుగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు రాక అవస్థ

విద్యుత్‌ భారం తగ్గించాలని సర్పంచుల డిమాండ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : అసలే అరకొర నిధులు, ఆర్థిక ఇబ్బందులు.. పైగా మూడు మాసాలుగా అందని రాష్ట్ర ప్రభుత్వ నిధులు.. ఆపై తడిసి మోపెడవుతున్న విద్యుత్‌ బిల్లులు.. చెల్లించలేక లబోదిబోమంటున్న పంచాయతీలు.. ఇదీ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల దుస్థితి. నిధుల్లేక కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలకు విద్యుత్‌ చార్జీలు షాక్‌ కొడుతున్నాయి. యూనిట్‌ చార్జీలు పెరగడంతో ప్రతినెలా వీధి దీపాలు, ఇళ్లకు తాగునీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్‌ బిల్లులు ఎక్కువ మొత్తంలో వస్తుండడంతో పంచాతీయలకు ఇవి భారంగా మారాయి. గతంతో పోలిస్తే.. ఒక్కో పంచాయతీకి ప్రతి నెలా వస్తున్న దానికి అదనంగా రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు అధికంగా బిల్లు వస్తోంది. రాష్ట్రంలోని 12769 గ్రామ పంచాయతీలు ప్రతి నెలా రూ.50కోట్ల వరకు విద్యుత్‌ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. గత మూడు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఒక్క పైసా కూడా విడుదల చేయకపోవడంతో వీటి చెల్లింపులకు పంచాయతీలు అప్పులు చేయాల్సి వస్తోందని పలువురు సర్పంచులు, కార్యదర్శులు చెబుతున్నారు. కొన్ని పంచాయతీల్లో ట్రాక్టర్ల వాయిదాలు చెల్లించలేకపోవడంతో ఖాతాల నుంచి బ్యాంకులు వాయిదాలను మినహాయించుకుంటున్నాయని కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. తక్కువ ఆదాయం వచ్చే 5500కు పైగా గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు నిర్వహణ ఖర్చులు, ట్రాక్టర్ల వాయిదాలు, కార్మికుల వేతనాలకే సరిపోతున్నాయి. దీంతో విద్యుత్‌ బిల్లుల చెల్లింపు కష్టంగా మారిందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంచినీటి సరఫరా వల్లే..

పంచాయతీల పరిధిలో వీధి దీపాల నిర్వహణ కన్నా.. మంచినీటి సరఫరా కోసమే విద్యుత్‌ వాడకం ఎక్కువవుతోందని, తమకు విడుదలయ్యే నిధుల్లో 25 శాతం విద్యుత్‌ బిల్లులకే సరిపోతోందని స్థానిక ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు సరిపడా మిషన్‌ భగీరథ నీళ్లు రాకపోవడంతో.. ప్రత్యామ్నాయ వనరుల ద్వారా నీటిని సరఫరా చేస్తుడటం ఇబ్బందిగా మారింది. పాత పద్ధతిలోనే బోర్లు, ఇతర వనరుల నుంచి నీటిని సరఫరా చేస్తున్న కారణంగా విద్యుత్‌ చార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. అంతేకాకుండా ప్రజల అవసరాలు తీర్చేందుకు ట్రాక్టర్ల ద్వారా కూడా మంచినీటి సరఫరా చేయాల్సి వస్తోంది. దీంతో పంచాయతీలకు విద్యుత్తు బిల్లుల భారం తప్పడం లేదు.

గతంలో ప్రభుత్వమే చెల్లించేది..

గ్రామ పంచాయతీలకు సంబంధించిన విద్యుత్‌ బిల్లులను గతంలో రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. అప్పట్లో సకాలంలో చెల్లించక రూ.కోట్లల్లో బకాయిలున్నా.. పంచాయతీలకు సమస్య ఉండేది కాదు. అయితే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక విద్యుత్‌ బిల్లులను ప్రతినెలా పంచాయతీలు చెల్లించాలని ఆదేశించింది. వీధి దీపాల నిర్వహణకు, మంచినీటి సరఫరా, తమ కార్యాలయానికి సంబంధించి విద్యుత్‌ చార్జీలను పంచాయతీలే చెల్లించాల్సి వస్తోంది. తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చిన్న పంచాయతీల విద్యుత్‌ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని సర్పంచులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-12-16T02:57:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising