ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్ ప్రభుత్వం శిశుపాలుడిలాగా వంద తప్పులు చేసింది: ఈటల

ABN, First Publish Date - 2022-04-09T20:55:45+05:30

టీఆర్ఎస్ ప్రభుత్వం శిశుపాలుడిలాగా వంద తప్పులు చేసింది, 101వ తప్పుకు ప్రజలు శిక్షిస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్ నగర్ జిల్లా: టీఆర్ఎస్ ప్రభుత్వం శిశుపాలుడిలాగా వంద తప్పులు చేసింది, 101వ తప్పుకు ప్రజలు శిక్షిస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  అన్నారు. శనివారం నిర్వహించిన కిసాన్ మోర్చా రైతు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘‘ఇరవై ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నాను. తెలంగాణ సాధన ఉద్యమంలో మహబూబ్ నగర్ జిల్లా జైలుకు వెళ్లా.  ప్రజలు టీఆర్ఎస్‌ను శిక్షించి నన్ను గెలిపించారు. ప్రజాప్రతినిధులు ప్రజల డబ్బు, సంపదకు కాపలాదారులు మాత్రమే. ప్రధాని నరేంద్ర మోదీ హూందాగా తన కర్తవ్వమని చెబుతారు. కేసీఆర్ నేనిచ్చానని చెబుతారు. గజ్వేల్ లోని ఆయన సొంత భూములు అమ్మి ఇస్తున్నారా? అని  ఈటల రాజేందర్ ప్రశ్నించారు. 

‘‘కేసీఆర్ తప్పులు చేస్తూ రైతులను వెంటాడుతున్నారు. నేను బాధ్యతతో మాట్లాడుతున్నాను. ఒక సందర్భంలో కేసీఆర్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని  చెప్పారు. ఒక రాష్ట్రంలో ఒక అవసరం ఉంటుంది. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అన్నారు కదా?. వ్యవసాయమే గ్రామీణ ఆర్థిక జీవనం. కంప్యూటర్ యుగంలో అన్నం పెట్టేది భూతల్లి మాత్రమే. అలాంటి వ్యవస్థను కాపాడాల్సింది పోయి వరి వేస్తే ఉరి అని స్వయానా సీఎం కేసీఆర్ చెప్పడం భావ్యమా? ప్రతిపక్షాలకు ప్రజల తరఫున కొట్లాడే బాధ్యత ఉంటుంది. ప్రజలు అధికారం ఇస్తే కుర్చీపై నుంచి వెలకిలపడి ధర్నాలు చేస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే కుర్చీపై కూర్చునే అధికారం లేదు’’ అని ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

Updated Date - 2022-04-09T20:55:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising