చికోటి ఇంట్లో ఈడీ సోదాలు..సినీ తారలతో ప్రమోషన్ వీడియోలు
ABN, First Publish Date - 2022-07-28T04:04:27+05:30
క్యాసినో (Casino) కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖులు, సెలబ్రెటీలతో...
హైదరాబాద్ (Hyderabad): క్యాసినో (Casino) కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖులు, సెలబ్రెటీలతో చికోటికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 10 మంది సినీ తారలను నేపాల్‌కు చికోటి రప్పించినట్లు తేలింది. సినీ తారలతో ఆర్థిక లావా దేవీలపై ఈడీ ఆరా తీస్తోంది.
క్యాసినోకు ముందు సినీ తారలతో చికోటి ప్రమోషన్ వీడియోలు తీసినట్లు అధికారులు గుర్తించారు. నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోలో 10 మంది టాలీవుడ్, బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ హాజరైనట్లు అధికారులు గుర్తించారు. అమేషా పాటిల్, మేఘననాయుడు, విల్సన్, గోవింద, ముమైత్‌ఖాన్, మల్లికాషరావత్, సింగర్ జాన్సీరాజు హాజరైనట్లు తేలింది. సినీ తారల పేమెంట్లపైనా అధికారులు దృష్టి సారించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలతోనూ చికోటికి సంబంధాలు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
క్యాసినో ఆరోపణలతో చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి (Madhareddy) ఇంట్లో 14 గంటలుగా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. చికోటి ప్రవీణ్ ఆయన సతీమణి, కుమారుడిని సైతం విచారించారు ఢిల్లీ నుండి వచ్చిన ఈడీ ప్రత్యేక బృందం... బోయినపల్లిలోని మాధవరెడ్డి ఇంట్లో దాడుల చేశారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పలు కీలక ఆధారాలు సేకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ప్రముఖులు వీరికి టచ్‌లో ఉన్నట్టు గుర్తించారు. మాధవరెడ్డి వాడుతున్న కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ గుర్తించిచారు. మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్‌గా తేలింది. మార్చ్ 31కి ఎమ్మెల్యే స్టిక్కర్ వాహనానికి గడవు ముగిసింది. అయినా అదే స్టిక్కర్‌తో మాధవరెడ్డి కారు నడుపుతున్నారు. కారు నెంబర్ ప్లేట్ సైతం టాంపరింగ్ చేసి వాహనం నడుపుతున్నారు.
Updated Date - 2022-07-28T04:04:27+05:30 IST