ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే నెల 26 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు !

ABN, First Publish Date - 2022-08-04T10:00:37+05:30

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సెప్టెంబరు 5 నుంచి ఎఫ్‌ఏ-2 పరీక్షలు
  • ఫిబ్రవరి లోపు టెన్త్‌ ప్రీఫైనల్‌.. విద్యాధికారుల సర్క్యులర్‌ 

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. కరోనా వల్ల గత మూడేళ్లగా విద్యా బోధన అస్తవ్యస్తం కావడంతో ఈ విద్యా సంవత్సరంపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సకాలంలో సిలబస్‌ పూర్తి చేసి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు విద్యాధికారులు ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. దానిప్రకారం సెప్టెంబరు 5 నుంచి ఫార్మాటివ్‌ అసె్‌సమెంట్‌-2 (ఎఫ్‌ఏ) పరీక్షలు నిర్వహించాలని, నవంబరు 1-7 తేదీల్లోపు సమ్మెటివ్‌ అసె్‌సమెంట్‌ (ఎస్‌ఏ)-1ను పూర్తి చేయాలని సూచించారు. అలాగే డిసెంబరులో ఎఫ్‌ఏ-3, వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఎఫ్‌ఏ-4 పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఇక, పదో తరగతి విద్యార్థులకు వచ్చే ఫిబ్రవరి లోపు ప్రీ ఫైనల్‌ పరీక్షలు పూర్తి చేసి వారిని ప్రధాన పరీక్షలకు సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, డిసెంబరు 22-28 వరకు క్రిస్మస్‌ సెలవులు, జనవరి 13-17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

Updated Date - 2022-08-04T10:00:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising