ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండుగ పూట.. పసిప్రాణాలు బలి

ABN, First Publish Date - 2022-10-07T08:23:19+05:30

పండుగపూట వంటింట్లో అమ్మ పిండివంట చేస్తుంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పిండి ముద్ద వినాయకుణ్ని నీటిలో 
  • వేయబోతూ కుంటలో పడి మృతి 
  • చెందిన ఇద్దరు చిన్నారులు
  • దసరా రోజే అక్కాతమ్ముళ్ల దుర్మరణం
  • సిద్దిపేట జిల్లా వెల్కటూర్‌లో విషాదం
  • దుర్గమ్మను నిమజ్జనం చేయబోతూ
  • హిమాయత్‌సాగర్‌లో పడి ఒకరు..
  • జగిత్యాల జిల్లాలో పూజారి గల్లంతు
  • రోడ్డు ప్రమాదంలో బావ, బావమరిది దుర్మరణం
  • మరో ఘటనలో బైక్‌లు ఢీ.. ఇద్దరి మృతి

సిద్దిపేట అర్బన్‌, రాజేంద్రనగర్‌, మల్యాల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): పండుగపూట వంటింట్లో అమ్మ పిండివంట చేస్తుంటే.. ఎందుకా ఆలోచన వచ్చిందో ఆ ఆరేళ్లబాలుడికి! పిండిముద్దతో వినాయకుడి బొమ్మ చేసి నిమజ్జనం చేద్దామనుకున్నాడు! ఆ ప్రయత్నంలో తానే నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. తమ్ముణ్ణి కాపాడే ప్రయత్నంలో సోదరి కూడా అసువులు బాసింది!! సిద్దిపేట జిల్లా వెల్కటూర్‌లో బుధవారం జరిగిందీ విషాదం. వెల్కటూర్‌కు చెందిన కాశపాక రాజు, కీర్తన  దంపతులకు కూతురు చందన(8), కొడుకు రుతిక్‌ (6) ఉన్నారు. బుధవారం దసరా పండుగ సందర్భంగా తల్లి కీర్తన పిండివంట చేస్తుండగా.. రుతిక్‌ తల్లి వద్దకు వెళ్లి కొంత పిండి తీసుకుని దాంతో వినాయకుడి బొమ్మ చేసుకున్నాడు. తర్వాత అక్క చందనతో కలిసి పూజ చేశాడు. సాయంత్రం వేళ పిల్లలిద్దరూ స్నేహితులతో కలిసి పక్కనే ఉన్న కుంట వద్దకు వెళ్లి గణేశుడి బొమ్మను నిమజ్జనం చేయబోయారు. మొదట కుంటలోకి దిగిన రుతిక్‌.. అక్కడ నీళ్లు ఎక్కువగా లేకపోవడంతో ఇంకొంచెం ముందుకు వెళ్లాడు. కానీ, అక్కడ లోతు ఎక్కువ ఉండడంతో మునిగిపోయాడు. తమ్ముడిని కాపాడేందుకు కుంటలోకి దిగిన చందన కూడా మునిగిపోయింది. వారి వెంట వచ్చిన స్నేహితులు  ఇంటికి వెళ్లి ఈ విషయం చెప్పారు. తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి వెతికి.. కుంట అడుగు భాగంలో ఉన్న పిల్లలిద్దరినీ బయటకు తీశారు. అప్పటికే రుతిక్‌ చనిపోయాడు. కొనప్రాణంతో అపస్మారక స్థితిలో ఉన్న చందనను సమీపంలో ఉన్న సురభి వైద్య కళాశాలకు తరలించారు.  చికిత్స పొందుతూ చందన కూడా మృతి చెందింది. పండగపూట.. అప్పటిదాకా ఆడుకుంటున్న పిల్లలిద్దరూ నీట మునిగి ప్రాణాలు కోల్పోవడంతో గుండెలవిసేలా పొగిలి పొగిలి రోదిస్తున్నారా తల్లిదండ్రులు.. 


దుర్గామాత నిమజ్జనంలో..

బతుకు తెరువు కోసం జహీరాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ కుటుంబంలో దసరా పండుగ రోజు విషాదం నెలకొంది. అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వెళ్లి ఆ ఇంట్లో ఒకరు మరణించారు. జహీరాబాద్‌కు చెందిన లక్ష్మణ్‌ కుటుంబం కొన్నాళ్లుగా హైదరాబాద్‌ అత్తాపూర్‌లోని మారుతీనగర్‌లో నివాసం ఉంటోంది. దసరా సందర్భంగా వారు ఇంట్లోనే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఐదురోజులు పూజ చేసి.. గురువారం నిమజ్జనం కోసం లక్ష్మణ్‌ పెద్ద కుమారుడు మల్లికార్జున్‌, చిన్నకుమారుడు శ్రీకాంత్‌ అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని హిమాయత్‌సాగర్‌కు వెళ్లారు. నిమజ్జనం చేస్తున్న సమయంలో  శ్రీకాంత్‌(25) కాలు జారి జలాశయంలో మునిగిపోయాడు.  మల్లికార్జున్‌ పోలీసులకు సమాచారం అందించడంతో, గజ ఈతగాళ్లను రప్పించి శ్రీకాంత్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. మరోవైపు.. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో దుర్గాదేవి నిమజ్జనం సమయంలో కెనాల్‌లో పడి పూజారి గల్లంతయ్యాడు. మల్యాల మండలం తాటిపల్లికి చెందిన బింగి ప్రసాద్‌ (44) స్థానిక మార్కండేయ ఆలయంలో కొన్నేళ్లుగా పూజారిగా పని చేస్తున్నాడు. బుధవారం దుర్గాదేవి విగ్రహాన్ని.. ఎస్సారెస్పీ కెనాల్‌లో నిమజ్జనం చేయడానికి వెళ్లి, కాలు జారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గురువారం సాయంత్రం వరకూ పూజారి ఆచూకీ లభించలేదు.

Updated Date - 2022-10-07T08:23:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising