అరెస్ట్ చేయొద్దు.. దర్యాప్తు చేసుకోవచ్చు
ABN, First Publish Date - 2022-12-23T04:18:32+05:30
హైదరాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): అభ్యంతరకర పోస్టుల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ వార్‌రూం ఉద్యోగులకు పోలీసులు జారీచేసిన సీఆర్పీసీ 41ఏ నోటీసులపై ఇచ్చిన స్టే ఉత్తర్వులను గురువారం హైకోర్టు
కాంగ్రెస్ వార్‌రూం కేసులో ఆదేశాలు సవరించిన హైకోర్టు
హైదరాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): అభ్యంతరకర పోస్టుల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ వార్‌రూం ఉద్యోగులకు పోలీసులు జారీచేసిన సీఆర్పీసీ 41ఏ నోటీసులపై ఇచ్చిన స్టే ఉత్తర్వులను గురువారం హైకోర్టు సవరించింది. సైబర్ క్రైం పోలీసులు నమోదు చేసిన ఈ కేసును దర్యాప్తు చేసుకోవచ్చని, అయితే నిందితులను అరెస్ట్ చేయరాదని సవరణ ఆదేశాలు జారీచేసింది. తమపై సైబర్ క్రైం పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని పేర్కొంటూ ముగ్గురు నిందితులు ఇషాన్ శర్మ, తాతినేని శశాంక్, మండ ప్రతా్‌పలు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ కె. సురేందర్ ధర్మాసనం పోలీసులు నిందితులకు జారీచేసిన 41ఏ నోటీసులపై స్టే విధించింది. తాజాగా గురువారం ఆ ఉత్తర్వులను సవరించింది.
Updated Date - 2022-12-23T04:18:33+05:30 IST