ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేన్సర్ అంటే భయపడాల్సిన పనిలేదు: నోరి దత్తాత్రేయుడు

ABN, First Publish Date - 2022-03-06T02:05:27+05:30

ప్రముఖ వైద్యులు నోరి దత్తాత్రేయరచించిన స్వీయ ఆత్మకథ ‘ ఒదిగిన కాలం’ గ్రంథాన్ని తెలంగాణ రాష్ట్రంలోని 400 గ్రంధాలయాలకు బహుకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రముఖ వైద్యులు నోరి దత్తాత్రేయరచించిన స్వీయ ఆత్మకథ ‘ ఒదిగిన కాలం’ గ్రంథాన్ని తెలంగాణ రాష్ట్రంలోని 400 గ్రంధాలయాలకు బహుకరించారు. ఈసందర్భంగా శనివారం తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో రాష్ట్ర గ్రంధాలయపరిషత్ ఛైర్మన్ ఆయాచితం శ్రీధర్, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ లకు రచయిత ఆ గ్రంధాలను అందజేశారు. ఈ సందర్భంగా నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ కేన్సర్ అంటే భయపడాల్సిన పనిలేదన్నారు. ప్రాథమిక దశలోనే దాన్ని గుర్తించే ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని ఆయన అన్నారు. ఆడవాళ్లకు వచ్చే రొమ్ము కేన్సర్, గర్భాశయ ముఖద్వరా కేన్సర్ స్క్రీనింగ్ ద్వారా మొదటి దశలో గుర్తించి నివారించే చర్యలు చేపట్టవచ్చని తెలిపారు. 


తాను హైదరాబాద్ లో వైద్య విద్యను చదువుకున్నానని, అమెరికా వెళ్లి తాను నేర్చుకున్న పరిశోధనా ఫలాలను తిరిగి ఈ నేలకే అందించాలన్నదే తన తపన అన్నారు. ఆధునిక కేన్సర్ చికిత్స ఇమినో థెరపీని సామాన్యులకు అందే విధంగా ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జూలూరు గౌరీశంకర్, ఆయాచితం శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఆధునిక భవనాలను నిర్మించే కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. గ్రంధాలయాలకు దాతలు పుస్తకాలను బహుకరించే సంస్క`తి మంచిదని అన్నారు. ప్రధానంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ గ్రంధాలయాలకు విరివిగా పుస్తకాలను అందించే పనిని ముమ్మరం చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. 

Updated Date - 2022-03-06T02:05:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising