ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM KCR ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ కీలక ప్రకటన..

ABN, First Publish Date - 2022-03-11T17:57:07+05:30

CM KCR ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ కీలక ప్రకటన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి సీనియర్ వైద్యుడు ఎంవీ రావు కీలక ప్రకటన చేశారు. అస్వస్థతతో ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్‌తో వైద్యులు మాట్లాడి మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించారు. రెండ్రోజులుగా కేసీఆర్ నీరసంగా ఉన్నారు. ఎడమ చేయి లాగుతున్నట్లు సీఎం చెప్పారు. ప్రాథమిక పరీక్షల తర్వాత యాంజియోగ్రామ్ చేస్తాం. జనరల్ చెకప్‌లో భాగంగానే అన్ని పరీక్షలు నిర్వహిస్తాం. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. కాగా ఇవాళ మధ్యాహ్నంపైన కేసీఆర్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదలయ్యే అవకాశం ఉంది.


కాగా.. ఇవాళ ఉదయం కేసీఆర్ అస్వస్థతకు లోనవ్వడంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. సీఎం వెంట.. ఆయన సతీమణి శోభ, కుమార్తె ఎమ్మెల్సీ కవిత, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఇదిలా ఉంటే.. మంత్రి కేటీఆర్ ఉప్పల్‌ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వెళ్లారు. విషయం తెలిసిన వెంటనే కేటీఆర్ అక్కడ్నుంచి ఆస్పత్రికి బయల్దేరారని తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే మంత్రి హరీశ్ రావు ఆస్పత్రికి చేరుకున్నారు.

Updated Date - 2022-03-11T17:57:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising