ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటుకగూడెం సర్పంచ్‌పై నెగ్గిన అవిశ్వాసం

ABN, First Publish Date - 2022-12-31T00:53:01+05:30

మండలంలోని గుం టుకగూడెం సర్పంచ్‌ అక్కి స రితాశ్రీనివాస్‌ (బీఆర్‌ఎ్‌స)పై సొంత పార్టీకి చెందిన వార్డు సభ్యులు పెట్టిన అవిశ్వాస తీ ర్మానం నెగ్గింది. శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆర్డీవో చెన్నయ్య స మక్షంలో జరిగిన సమావేశం లో సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో సర్పంచకు వ్యతిరేకంగా ఆరుగురు సభ్యులు చేతులు ఎత్తడంతో అవిశ్వాసం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు.

అవిశ్వాస సమావేశంలో పాల్గొన్న ఆర్డీవో చెన్నయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటుకగూడెం సర్పంచ్‌పై నెగ్గిన అవిశ్వాసం

సొంత పార్టీ వార్డు సభ్యులే అవిశ్వాసం పెట్టిన వైనం

నిడమనూరు, డిసెంబ రు 30: మండలంలోని గుం టుకగూడెం సర్పంచ్‌ అక్కి స రితాశ్రీనివాస్‌ (బీఆర్‌ఎ్‌స)పై సొంత పార్టీకి చెందిన వార్డు సభ్యులు పెట్టిన అవిశ్వాస తీ ర్మానం నెగ్గింది. శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆర్డీవో చెన్నయ్య స మక్షంలో జరిగిన సమావేశం లో సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో సర్పంచకు వ్యతిరేకంగా ఆరుగురు సభ్యులు చేతులు ఎత్తడంతో అవిశ్వాసం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. నివేదిక ను కలెక్టర్‌కు పంపించనున్నట్లు ఆర్డీవో తెలిపారు. కొత్త పంచాయతీ అయిన గుంటుకగూడెం మొదటి సర్పంచ్‌గా గన్నెపాక స్వామి ఎన్నికయ్యాడు. కానీ 10నెలల కాలంలో నే సర్పంచ్‌ స్వామి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. దీంతో ఉప సర్పంచ్‌గా ఉ న్న అక్కి సరితకు సర్పంచ్‌ బాధ్యతలు అప్పగించారు. కానీ ప్రభుత్వం ఉపఎన్నిక ని ర్వహించకపోవడంతో మూడేళ్లుగా ఆమె సర్పంచ్‌గా కొనసాగుతుంది. సర్పంచ్‌, వార్డు సభ్యులు ఒకే పార్టీకి చెందిన వారయినా సఖ్యత లేకపోవడంతో సభ్యులు సర్పంచ్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. దీంతో అవిశ్వాసం అనివార్యమైంది. సొంత పార్టీ వారే పదవి నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. సర్పంచ్‌ ఇటీవల ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గంతో పని చేస్తున్నారు. ఇరువర్గాల నడుమ సఖ్యత కుదిర్చేందుకు ముఖ్య నాయకు లు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అవిశ్వాసం తప్పలేదు. కాగా అవిశ్వాసం నెగ్గినందున సర్పంచ్‌ బాధ్యతలు అప్పగించేందుకు ఉప సర్పంచ్‌ లేనందున ఓ సమావేశం ఏర్పాటు చేసి ముందుగా ఉపసర్పంచ్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. సమావేశం లో తహసీల్దార్‌ ప్రమీల, డీఎల్‌పీవో ప్రతా్‌పనాయక్‌, ఎంపీవో రామలింగయ్య, పంచాయతీ కార్యదర్శి సరిత, సభ్యులు గుడిసె శంకర్‌, మేరెడ్డి రాజిరెడ్డి, నాగరాజు, ప్రవీణ్‌, బానాల సరిత, వెంకటమ్మ, సోమమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:53:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising