ధరణి సమస్యలను పరిష్కరించాలి: చాడ
ABN, First Publish Date - 2022-12-16T03:30:46+05:30
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌లోని లొసుగులతో చిన్న, సన్నకారు రైతులు, బడుగు, బలహీనవర్గాల ప్రజలు భూముల సమస్యలు పరిష్కారంకాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌లోని లొసుగులతో చిన్న, సన్నకారు రైతులు, బడుగు, బలహీనవర్గాల ప్రజలు భూముల సమస్యలు పరిష్కారంకాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ధరణిలో భూ రికార్డులు తారుమారుకావడంతో కొందరు రైతులకు రైతుబంధు రావడంలేదని, చనిపోయిన రైతులకు సంబంధించి బీమా అందడంలేదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8లక్షల ఎకరాల్లో సాదాబైనామాలతో కొన్న భూముల దరఖాస్తులు ఇప్పటికీ మీసేవలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఽధరణి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Updated Date - 2022-12-16T03:30:47+05:30 IST