శాంతిభద్రతలతోనే రాష్ట్రం అభివృద్ధి
ABN, First Publish Date - 2022-12-16T03:10:02+05:30
వెంకటాపురం (నూగూరు), కొత్తగూడెం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మావోయిస్టుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల అమల్లో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల కృషి అభినందనీయమని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ జిల్లాల
మావోయిస్టురహిత రాష్ట్రంగా మార్చేందుకు చర్యలు: డీజీపీ
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటన
వెంకటాపురం (నూగూరు), కొత్తగూడెం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మావోయిస్టుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల అమల్లో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల కృషి అభినందనీయమని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ జిల్లాల ప్రజల భాగస్వామ్యంతో పోలీసులు మావోయిస్టుల కార్యకలాపాలను అడ్డుకోవడంతో సఫలమవుతున్నారన్నారు. గురువారం ఆయన ఈ జిల్లాల్లో పర్యటించారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పరిఽధిలోని హేమచంద్రాపురంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో, ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలంలోని ఆలుబాకలో పోలీసు క్యాంపు సందర్శన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టురహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు పోలీసు శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల నుంచి మావోయిస్టులు రాష్ట్రంలోకి చొరబడకుండా ప్రజల భాగస్వామ్యం, సహకారం తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా, శాంతిభద్రతలతో ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. శాంతిభద్రతలు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖకు ఎంతో సహకరిస్తోందని, ఈ క్రమంలోనే మావోయిస్టుల కార్యకలాపాల నియంత్రణ చేయగలుగుతున్నామని తెలిపారు.
Updated Date - 2022-12-16T03:10:03+05:30 IST