ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్బంధం.. కేసీఆర్‌ నైజం

ABN, First Publish Date - 2022-06-26T08:57:56+05:30

వాగ్దానాలను నెరవేర్చాలని ప్రశ్నించిన వారిని పోలీసులతో నిర్బంధించి, కేసులు పెట్టించడం సీఎం కేసీఆర్‌ నైజమని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు : షర్మిల

పెన్‌పహాడ్‌, జూన్‌ 25: వాగ్దానాలను నెరవేర్చాలని ప్రశ్నించిన వారిని పోలీసులతో నిర్బంధించి, కేసులు పెట్టించడం సీఎం కేసీఆర్‌ నైజమని   వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 105వ రోజైన శనివారం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలంలో ఆమె 15 కిలోమీటర్లు నడిచారు. మండలంలోని తంగెళ్లగూడెం, చీదెళ్ల, గాజులమల్కాపురం, నూర్జాహాన్‌పేట గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ ప్రజలతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధి పనులు శూన్యమని అన్నారు. ‘‘చీదెళ్ల గ్రామాన్ని మంత్రి జగదీశ్‌ రెడ్డి దత్తత తీసుకున్నాడంట. అయినా ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా లేదు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణ, బార్ల తెలంగాణ, బీర్ల తెలంగాణగా మార్చారు. రాష్ట్రంలో బడులు, గుడుల కన్నా మద్యం దుకాణాలే ఎక్కువగా ఉన్నాయు’’ అని షర్మిల వ్యాఖ్యానించారు. ఇక ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు పాలకపక్షం చంకన చేరాయని విమర్శించారు. 

Updated Date - 2022-06-26T08:57:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising