ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Scamలో కదులుతున్న డొంక

ABN, First Publish Date - 2022-09-20T16:37:52+05:30

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam case) హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతోంది. ముడుపుల విషయంలో లోతుగా ఈడీ (ED) దర్యాప్తు చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Delhi : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam case) హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతోంది. ముడుపుల విషయంలో లోతుగా ఈడీ (ED) దర్యాప్తు చేస్తోంది. లిక్కర్ స్కాం కేసులో ఉన్న కంపెనీలకు హైదరాబాద్ కంపెనీల నుంచి భారీగా ముడుపులు అందాయి. శ్రీనివాసరావు (Srinivasa Rao)కు చెందిన పలు కంపెనీల నుంచే ముడుపులు వెళ్లినట్టు ఆధారాలు ఉన్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్యంగా శ్రీనివాసరావు పేరు తెరమీదకి వచ్చింది. చార్టెట్ అకౌంటెంట్ బుచ్చిబాబు (CA Butchi Babu) ఇంట్లో సోదాల అనంతరమే శ్రీనివాసరావుపై ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు.


దోమలగూడ లోని బుచ్చిబాబు నివాసంలో సుదీర్ఘంగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. బుచ్చిబాబు ఇంట్లో లభించిన హార్డ్ డిస్క్‌లో కీలక సమాచారం ఉన్నట్టు గుర్తించారు. శ్రీనివాసరావు ద్వారానే కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్టు ఆధారాలున్నాయి. కంపెనీల ఏర్పాటుకు సంబంధించి డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు ఒప్పంద పత్రాలను ఈడీ క్షుణంగా పరిశీలిస్తోంది. పిళ్ళై, శ్రీనివాసరావు మధ్య జరిగిన సంభాషణలను ఈడీ రిట్రైవ్ చేసింది. సిగ్నల్ యాప్ ద్వారా ఇరువురి మధ్య సంభాషణలు జరిగినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. శ్రీనివాసరావు, పిళ్లైల నుంచి ఈడీ కీలక సమాచారం సేకరించింది.


ఈడీ అధికారుల సోదాల్లో మరో సంచలన అంశం


పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీ నేతలకు 200 కోట్లు ఇచ్చినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. 200 కోట్లు శ్రీనివాసరావు ద్వారానే లావాదేవీలు జరిగినట్టు ఈడి వద్ద ఆధారాలు ఉన్నాయి. 200 కోట్లు లావాదేవీల పైన శ్రీనివాసరావును ఈడీ ప్రశ్నించింది. లిక్కర్ టెండర్ల కోసం చెల్లించారా లేదా మరో దానికా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఆడిటర్ బుచ్చిబాబు ఇంట్లో  కీలక ఆధారం లభ్యమైంది. లిక్కర్ స్కీమ్ కోసం వేయాల్సిన టెండర్లు ముట్టాల్సిన సొమ్ము కట్టాల్సిన పైసా సమీకరణ చేసుకునట్టు శ్రీనివాస్‌పై ఆరోపణలున్నాయి. టెండర్ల నుంచి లైసెన్స్ వరకూ రెండు వేల కోట్లు హైదరాబాద్ నుంచి వెళ్లినట్టు ఈడి గుర్తించింది. 18 జోన్‌లకు సంబంధించి తొమ్మిది లిక్కర్ కంపెనీలకు హైదరాబాద్ వ్యాపారవేత్తలకు లింకులున్నాయి. ఈ డబ్బు ఎవరి ఖాతాలో నుంచి వెళ్లిందనే అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

Updated Date - 2022-09-20T16:37:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising