ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక శాంపిల్ మాత్రమేనా..? కేసీఆర్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బీజేపీ వ్యూహాం..!

ABN, First Publish Date - 2022-08-27T23:51:16+05:30

ఎన్డీయే (NDA) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఎవరిని ఎలా టార్గెట్ చేస్తుందో ఎవరికీ అంతుచిక్కడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎన్డీయే (NDA) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఎవరిని ఎలా టార్గెట్ చేస్తుందో ఎవరికీ అంతుచిక్కడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎప్పుడు ఏ రాజకీయ పార్టీని లక్ష్యంగా ఎంచుకుంటుందో, ఏ నాయకుడిని రాజకీయంగా తొక్కిపెడుతుందో తెలియడం లేదని వాపోతున్నాయి. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హుంకరించే పార్టీలు ఐటీ, ఈడీ (ED IT Raids) దాడులతో వణికిపోతున్నాయి. కేంద్రంతో సఖ్యతగా ఉంటే ఎలాంటి ఇబ్బందులుండవని, కేంద్రాన్ని పల్లెత్తు మాట అన్నా తెల్లారే వాళ్ల ఇండ్ల ముందు ఈడీ అధికారులు తిష్టవేస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే కేంద్రం అసమ్మతిని భరించలేకపోతోంది. ఇలా ప్రాంతీయ పార్టీలను చెప్పుచేతుల్లో పెట్టుకుని ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా సాధిస్తూ చాలా వరకు ప్రాంతీయ పార్టీలను చెప్పుచేతుల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చిందని అంటున్నారు. ఇప్పటికే సర్వేలతో కలవరపడుతున్న కేసీఆర్‌కు పులి మీద పుట్రలా లిక్కర్ స్కాం వంటి ఆరోపణలు తోడయి కలకలం రేపుతున్నాయి. 


తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. బీజేపీ నేతలు అంటున్నట్లుగానే రాష్ట్రంలో బీజేపీ రెండో స్థానంలో ఉందని అనేక సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణలో ఇప్పుడు టీఆర్‌ఎస్, బీజేపీ (TRS BJP) పోటాపోటీగా తలపడుతున్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు తగ్గేదేలా అని సవాల్ విసురుకుంటున్నారు. కొంతకాలంగా కేంద్రప్రభుత్వంపై సీఎం కేసీఆర్ (CM KCR) కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఆయన నోటికోచ్చినట్లు ఈడీలు బోడీలు తమను ఏం చేయలేవని ధీమాతో ఉన్నారు. కేంద్రాన్ని కేసీఆర్ ఢీ కొడుతున్న సమయంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కలకలం రేపింది. ఈ దందాలో కేసీఆర్ కుటుంబ పాత్ర ఉందని బీజేపీ నేతలు బయటపెట్టడం తెలంగాణ రాజకీయాలను ఒక్కసారి హీట్ పెంచాయి.


ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (CM Kejriwal), డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia) కలిసి ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించారు. తెలంగాణ (Telangana), పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి లిక్కర్ విధానం అమలు చేస్తున్నారని దాన్నే ఢిల్లీలో అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. దీని పూర్తి బాధ్యతలను మనీష్ సిసోడియాకు అప్పగించారు. ఈ దందాలో మనీష్ సిసోడియా ప్రమేయం ఉందని సీబీఐ అధికారుల తేల్చారు. అంతవరకు బాగానే ఉంది. ఓ ఫైన్ మార్నింగ్ ఈ కుంభకోణం వెనుక కవిత హస్తం ఉందని ఎంపీ పర్వేశ్‌ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌ సిర్సా ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యుల సలహా మేరకే ఢిల్లీ ప్రభుత్వం మద్యం విధానం రూపొందిందని బీజేపీ నేతలు బాంబ్ పేల్చారు. కేసీఆర్ ఫ్యామిలీతోపాటు లిక్కర్ మాఫియా నుంచి మనీష్ సిసోడియాకు రూ.150 కోట్లు అందాయని ఆరోపిస్తున్నారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యుల సూచన మేరకే ఢిల్లీ మద్యం విధానం రూపొందించారని, తెలంగాణకు చెందిన ఒక మద్యం వ్యాపారి ఢిల్లీలోని ఒబెరాయ్‌ హోటల్‌లో ఆరు నెలలపాటు ఒక రూమ్‌ను కవిత కోసం బుక్‌ చేసి ఉంచారని వెల్లడించారు. మద్యం విధానానికి సంబంధించిన చర్చల్లో స్వయంగా కవిత పాల్గొన్నారని, కోకాపేటకు చెందిన రామచంద్రన్‌ పిళ్లై అనే మద్యం వ్యాపారిని ఢిల్లీకి ఆమే తీసుకొచ్చారని తెలిపారు. కవిత ఢిల్లికి వచ్చి రూ. 4.5 కోట్లతో డీల్ కుదిర్చారని నేతలు అంటున్నారు. పంజాబ్, గోవా ఎన్నికల సందర్భంగా అడ్వాన్సుగా రూ. 4.5 కోట్లు ముట్టాయని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారమంతా కవిత ద్వారానే జరిగిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఢిల్లీ బీజేపీ నేతల ఆరోపణలను రాష్ట్ర బీజేపీ నేతలు అందుకున్నారు. నేరుగా కవితను టార్గెట్ చేస్తూ ఆమె ఇంటి ముందు ధర్నాలు, ఆందోళనలకు బీజేపీ శ్రేణులు దిగాయి.


కవితకు మంత్రులు, నేతల సంఘీభావం

‘‘మేం తలుచుకుంటే.. మీరు రోడ్ల మీద తిరగలేరు. పార్టీ శ్రేణులు బరిలోకి దిగితే బీజేపీ నేతలు ఇళ్ల నుంచి కాలు కూడా బయట పెట్టలేరు’’ అని టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి నేపథ్యంలో మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు ఆమె నివాసానికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు. కేసీఆర్‌ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే బీజేపీ నేతలను ఎక్కడికక్కడ నిలువరిస్తామని హెచ్చరించారు. తమ పార్టీ అధినేత కేసీఆర్‌ సంస్కారం నేర్పారని, అందుకే సహనంతో ఉన్నామని చెప్పారు. బీజేపీ నేతలు మరోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధార ఆరోపణ లు చేయడమే కాకుండా కవిత ఇంటిపై ఆ పార్టీ గూం డాలు దాడికి పాల్పడడాన్ని ఖండిస్తున్నామని, బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు 60 లక్షల సైన్యం ఉందని, తాము తలచుకుంటే బీజేపీ నాయకులు ఇంట్లో నుంచి బయటకు రాలేరని హెచ్చరించారు.


కవితకు కోర్టులో ఊరట

ఢిల్లీ, తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని కవిత హైదరాబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. నిరాధార ఆరోపణలతో ప్రకటనలు చేశారని పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. ప్రజాజీవితంలో తనకున్న పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించడానికి ఈ పద్ధతులను ఎంచుకున్నారని న్యాయస్థానానికి నివేదించారు. వాదనలు విన్న న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు (ఇంజంక్షన్‌ ఆర్డర్‌) ఇచ్చింది. కవిత పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు ఆదేశించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత పేరును ఎక్కడా, ఎవరూ ఉపయోగించవద్దని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే ఈ కేసులో ప్రతివాదులైన పర్వేశ్‌ వర్మ, మంజీందర్‌ సిర్సాలకు నోటీసులు జారీ చేసింది.


కవితపై కేసీఆర్ ఆగ్రహం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు బయటకు రావడంతో కేసీఆర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఢిల్లీ మద్యం పాలసీ అవకతవకల వ్యవహారంలో కవిత పేరు తెరపైకి రావడంపై ఆయన కొంత చికాకు, అసహనం వ్యక్తం చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇలాంటి తలపోటు వ్యవహారాల్లో తలదూర్చడం వాంఛనీయం కాదని ఆయన ఆగ్రహంగా అన్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవిత ప్రమేయం ఉందని, ఆమె ద్వారా డబ్బు లావాదేవీలు జరిగాయంటూ బీజేపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. మద్యం మాఫియా కమిషన్‌ను 10 శాతం పెంచేందుకు చేసుకున్న రూ.150 కోట్ల డీల్‌లో మొదటి విడత మొత్తం కవిత ద్వారా సిసోడియాకు ముట్టిందని వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో తనకు సంబంధం లేదని కవిత స్పష్టం చేయగా.. కేసీఆర్‌ ప్రమేయమూ ఉందని సంజయ్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కవితపై కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


                                                                                                                 బి. భాస్కర్

Updated Date - 2022-08-27T23:51:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising