ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi: జంతర్‌మంతర్‌లో Kaleswaram ముంపు బాధితుల ఆందోళన

ABN, First Publish Date - 2022-06-15T18:11:33+05:30

ఢిల్లీ జంతర్ మంతర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులు బుధవారం ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ/తెలంగాణ: ఢిల్లీ జంతర్ మంతర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులు బుధవారం ఆందోళనకు దిగారు.  చెన్నూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. బాధితుల ఆందోళనకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మద్దతు ఇచ్చారు. ప్రతి ఏటా కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో 15 వేల ఎకరాలకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బాధితులు నిరసన చేపట్టారు. 


ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.... తెలంగాణ సాధించుకున్నది నీళ్లు నిధులు నియామకాల కోసమన్నారు. ఇప్పుడది మర్చిపోయి భారతీయ రాష్ట్ర సమితి అంటూ కేసీఆర్ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. కమీషన్ల కొరకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారని.. కేసీఆర్ ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగు సంవత్సరాలలో 40 వేల ఎకరాలకు పైగా నష్టం జరిగిందని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-06-15T18:11:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising