ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రచారానికి వెళ్లిన.. టీఆర్‌ఎస్‌ నాయకుడి మృతి

ABN, First Publish Date - 2022-10-17T09:39:30+05:30

మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన ఓ టీఆర్‌ఎస్‌ నాయకుడు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి మరణించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామంతాపూర్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన ఓ టీఆర్‌ఎస్‌ నాయకుడు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి మరణించాడు. రామంతాపూర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు జగదీ్‌షకుమార్‌(52) ఉప ఎన్నిక పనుల నిమిత్తం నాలుగు రోజుల క్రితం మునుగోడు, నారాయణపురం మండలంలోని పుట్టపాకకు వెళ్లారు. ఆదివారం ఓ భవనంపైకి వెళ్లిన ఆయన పక్కనే ఉన్న చెట్టు నుంచి సీతాఫలాలు తీసేందుకు యత్నించారు. ఈ క్రమంలో అదుపు తప్పి కిందపడ్డారు. దీంతో తీవ్రగాయాలపాలైన జగదీ్‌షను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. జగదీ్‌షకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.  

Updated Date - 2022-10-17T09:39:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising