ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు ఏర్పాట్లు: Cs somesh kumar

ABN, First Publish Date - 2022-05-20T22:02:46+05:30

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు భారీగా ఏర్పాట్లుచేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్(somesh kumar) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు భారీగా ఏర్పాట్లుచేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్(somesh kumar) తెలిపారు. ఈమేరకు  ఏర్పాట్లపై శుక్రవారం ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డి తోపాటు వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 వ తేదీన  ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా అమర వీరుల స్తూపం వద్దకు చేరుకొని తెలంగాణ అమరులకు నివాళులు అర్పిస్తారని, అనంతరం పబ్లిక్ గార్డెన్ కు చేరుకొని జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని అన్నారు. పోలీసు దళాల గౌరవ  వందనాన్ని స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుందని తెలిపారు. 


అదే రోజు సాయంత్రం 30 మంది ప్రముఖ కవులచే కవిసమ్మేళనం రవీంద్ర భారతి లో నిర్వహిస్తున్నట్లు వివరించారు.ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అర్వింద్ కుమార్, సునీల్ శర్మ, జిఎడి కార్యదర్శి శేషాద్రి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త,  హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీ.వి.ఆనంద్, జల మండలి ఎం.డి దాన కిషోర్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకెష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ లతోపాటు పోలీసు, రోడ్లు భవనాలు,విధ్యుత్, సమాచార శాఖ, ఉద్యాన వన శాఖ, తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T22:02:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising