ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో తెలంగాణ నెంబర్ వన్: సీఎస్

ABN, First Publish Date - 2022-01-11T00:47:59+05:30

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని, ఇదే విధంగా కొనసాగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని, ఇదే విధంగా కొనసాగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు, రెవెన్యూ (సీటీ & ఎక్సైజ్), పౌర సరఫరాలు, రవాణా, ఇంధనం, గృహ నిర్మాణం, మున్సిపల్,కార్మిక, తదితర 12 విభాగాలకు చెందిన కస్టమర్లు,ప్రజలకు మరింత మెరుగైన  సేవలందించడం పై సీఎస్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. 


ప్రభుత్వంలోని 12 శాఖల్లోని  20 హెచ్‌ఓడీలలో 301 సంస్కరణలు ఈఓడీబీ లో భాగంగా  అమలవుతున్నాయని, ఈ ప్రక్రియలను మరింత సరళీకృతం చేసి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూనే, యూజర్ ఫ్రెండ్లీ, పీపుల్ ఫ్రెండ్లీ విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో ఉపాది శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని , ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఈఎస్ అండ్ టీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-11T00:47:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising