ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖరీఫ్‌ నుంచి పంటల బీమా?

ABN, First Publish Date - 2022-12-16T01:51:11+05:30

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రైతులు, రైతు సంఘాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శల నుంచి బయటపడేందుకు పంటల బీమా పథకం అమలు చేయాలనే ఆలోచనకు సీఎం కేసీఆర్‌ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతుల విమర్శలతో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

ఎన్నికలకు ముందు అమలుచేస్తే లబ్ధి అనే వ్యూహం!

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రైతులు, రైతు సంఘాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శల నుంచి బయటపడేందుకు పంటల బీమా పథకం అమలు చేయాలనే ఆలోచనకు సీఎం కేసీఆర్‌ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు పర్యవేక్షణలో అధికారుల బృందంతో కేంద్రం, ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న పంటల బీమా పథకాలపై అధ్యయనం చేయిస్తున్నట్లు సమాచారం. సొంతంగానే పథకానికి రూపకల్పన చేసి వచ్చే వానాకాలం నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తే ఎంత ఖర్చు అవుతుంది? రైతుల నుంచి కూడా ఎంతో కొంత ప్రీమియం వసూలు చేయాలా? మండలం, గ్రామం- దేన్ని యూనిట్‌గా తీసుకోవాలి? వంటి కోణాల్లో కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. 2016 నుంచి మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎం-ఎ్‌ఫబీవై) పథకాన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చింది. దీనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రైతుల వాటాధనం కూడా ఉండేది. అయితే ఈ పథకంలో రైతుల కంటే బీమా కంపెనీలే ఎక్కువ లబ్ధి పొందుతున్నాయనే విమర్శలు రావడంతో కొనసాగాలా వద్దా అనేది రాష్ట్రాల ఇష్టమని కేంద్రం తెలిపింది. అదే అదనుగా తెలంగాణతో పాటు గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌ సహా కొన్ని రాష్ట్రాలు ఈ పథకం నుంచి బయటకు వచ్చాయి. కొన్ని రాష్ట్రాలు సొంతంగా పంటల బీమా పథకాలు అమలు చేస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లుగా ఏ పంటల బీమా పథకాన్నీ అమలు చేయడం లేదు. 2020 నుంచి వరుసగా మూడేళ్లు కుండపోత, అకాల వర్షాలకు లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అయినా రైతులకు నయాపైసా నష్ట పరిహారం అందలేదు. ప్రభుత్వం కనీసం ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా పంపిణీ చేయలేదు. దీంతో కొందరు కోర్టులను కూడా ఆశ్రయించారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్‌ను ఫ్లాగ్‌షిప్‌ స్కీమ్‌లుగా అమలు చేస్తున్నా పంటల బీమా పథకం లేకపోవటంతో రైతులు, రైతు సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునరాలోచనలో పడినట్లు తెలిసింది.

సొంత పథకానికే మొగ్గు

కేంద్ర ప్రభుత్వ ఫసల్‌ బీమా యోజనను ఇకమీదట తెలంగాణలో అమలు చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ పథకం లోపభూయిష్టంగా ఉన్నదని కేసీఆర్‌ పలుమార్లు విమర్శించారు. దాంతో లాభం కంటే నష్టమే ఎక్కువని, అందుకే తెలంగాణలో అమలు చేయడం లేదని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత కూడా లేదు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని అడాప్ట్‌ చేసుకుంటే వెనకడుగు వేసినట్లు అవుతుందనే రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రంతో నువ్వా? నేనా? అని పోటీపడుతున్న సమయంలో సొంతంగా పంటల బీమా పథకానికి రూపకల్పన చేసి, సొంత నిధులతో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ పదవీ కాలం కూడా మరో ఏడాది మాత్రమే ఉంది. ఈ లోపు మూడు, నాలుగు కొత్త పథకాలు కూడా తీసుకురావాలనే వ్యూహంలో కేసీఆర్‌ ఉన్నారు. పైగా తెలంగాణ వ్యవసాయాధారిత రాష్ట్రం కావటం, ఎన్నికల ఫలితాలను శాసించే స్థాయిలో 65 లక్షల రైతుల కుటుంబాలు రాష్ట్రంలో ఉండడంతో వచ్చే ఎన్నికల్లో వారి నుంచి వ్యతిరేకత లేకుండా చేసుకోవాలనే వ్యూహం కూడా బీఆర్‌ఎస్‌ నాయకత్వంలో ఉండటం గమనార్హం. ఈ ఏడాది యాసంగి సాగు ఎలాగూ మొదలైంది. ఈ క్రమంలో ఎన్నికల సంవత్సరంలో వచ్చే వానాకాలం నుంచి పంటల బీమాను అమలు చేస్తే అటు రైతులకు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మేలు కలుగుతుందని భావిస్తున్నట్లు తెలిసింది.

గ్రామం యూనిట్‌గా..!

పంటల బీమా పథకాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. రైతులు చెల్లించే ప్రీమియంతో పోలిస్తే వారికి కలిగే ప్రయోజనం తక్కువగా ఉంది. రైతులకు ఎలా మేలు చేకూర్చాలనే కంటే వారికి ఎలా పరిహారం అందకుండా చూడాలనే దృష్టితోనే నిబంధనలు కఠినంగా ఉంటున్నాయి. మండలం యూనిట్‌గా తీసుకుని పంట బీమా అమలు చేయడంతో రైతులకు మేలు జరగడం లేదు. దీంతో గ్రామం యూనిట్‌గా తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-12-16T01:51:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising